Site icon HashtagU Telugu

Shiva Abhishekam: శివుడికి అభిషేకం చేస్తే కలిగే శుభాలివే..

Lard Shiva

Lard Shiva

Shiva Abhishekam: శివుడు భక్తుల కొంగు బంగారమే కాదు.. అభిషేక ప్రియుడు కూడా. అందుకే భక్తులు కచ్చితంగా శివుడికి అభిషేకం చేయాలనుకుంటారు. అభిషేకం చేయడం వల్ల అటు ఆధ్యాత్మికం, ఇటు ఆరోగ్య పరంగానూ ఎన్నో లాభాలున్నాయి. శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుంది. శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు. తద్వారా ఆ కుటుంబం తరతరాల పాటు సకల శుభాలను సంతరించుకుంటుంది.

ఆవుపాలతో శివునికి అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి. పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి.మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభిస్తాయి. గరిక నీటితో శివాభిషేకం చేయించిన వారికి నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు. పెరుగుతో శివునికి అభిషేకం చేయిస్తే.. ఆరోగ్యం చేకూరుతుంది. పంచదారతో చేయిస్తే దుఃఖం తొలగిపోతుంది. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

వీటితోనూ అభిషేకం చేయొచ్చు

1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.