Ayodhya Rammandir : మల్టీప్లెక్సు స్క్రీన్ ఫై అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం చూసే ఛాన్స్ ..

దేశం మొత్తం రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఎక్కడ చూసిన..ఏ నోటా విన్న ఓకే ఒక మాట అదే జై శ్రీరామ్..జై రామ్..అయోధ్య లో రేపు జరగబోయే ప్రాణప్రతిష్ట (Ayodhya Rammandir) కార్యక్రమం కోసం భక్తులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకను దేశం మొత్తం చూసేలాగా అన్ని చానెల్స్ కు లైవ్ అందించబోతుంది కేంద్రం. దాదాపు 500 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకుంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధ్వర్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్య రామమందిర […]

Published By: HashtagU Telugu Desk
Aajtak And Pvr Inox Tie Up

Aajtak And Pvr Inox Tie Up

దేశం మొత్తం రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఎక్కడ చూసిన..ఏ నోటా విన్న ఓకే ఒక మాట అదే జై శ్రీరామ్..జై రామ్..అయోధ్య లో రేపు జరగబోయే ప్రాణప్రతిష్ట (Ayodhya Rammandir) కార్యక్రమం కోసం భక్తులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకను దేశం మొత్తం చూసేలాగా అన్ని చానెల్స్ కు లైవ్ అందించబోతుంది కేంద్రం. దాదాపు 500 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకుంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధ్వర్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగర వీధులన్నీ తీర్చిదిద్దిన రంగవల్లులతో భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. రామమందిరం గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని బుధవారం అర్ధరాత్రి తర్వాత వేద మంత్రోచ్ఛారణల నడుమ శుభ ముహూర్తంలో ప్రవేశపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రేపు జరగబోయే ప్రాణప్రతిష్ట కార్యక్రమం చూసేందుకు పివిఆర్ ఐనాక్స్ (PVR Inox) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 160కి పైగా స్క్రీన్లలో ఈ సుమధుర ఘట్టాన్ని చూసేలా లైవ్ ప్రదర్శించబోతున్నారు. టైం పరిమితి అంటూ లేకుండా కార్యక్రమం జరిగినంత సేపు చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం భారీగా ధర పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ రూ.100 లతో ఈ కార్యక్రమం చుసేయొచ్చని పేర్కొంది. అంతే కాదు ఫ్రీ గా పాప్ కార్న్ కూడా అందిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్ సహా అన్ని నగరాల్లోనూ ఈ లైవ్ షో లు ఉండనున్నాయి. గతంలో క్రికెట్ మ్యాచులు ఇలా ప్రసారం చేసేవాళ్ళు.. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ ఆలయ ఓపెనింగ్స్ కు వచ్చేసింది. చరిత్రలోనే ఒక అరుదైన సంఘటనగా నిలిచిపోయే రామాలయ ప్రారంభోత్సవ వేడుకని కనివిని ఎరుగని స్థాయిలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు టికెట్ బుక్ చేసుకొని.. అయోధ్యలో జరగబోయే మహా ఘట్టం రామాలయ ప్రారంభోత్సవాన్నీ చుసెయ్యండి.

Read Also : Lord Rama: శ్రీరాముడు ఏ చెట్టుకు పూజలు చేశాడో తెలుసా..? శివ‌య్య‌కు ఏ మొక్క‌ ఇష్ట‌మో తెలుసా..?

  Last Updated: 20 Jan 2024, 10:33 AM IST