Ayodhya Ram New Name : అయోధ్య రామయ్యకు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?

Ayodhya Ram New Name :  అయోధ్యలో కొలువుతీరిన బాల రాముడికి అర్చకులు కొత్త పేరు నిర్ణయించారు.

  • Written By:
  • Publish Date - January 23, 2024 / 03:46 PM IST

Ayodhya Ram New Name :  అయోధ్యలో కొలువుతీరిన బాల రాముడికి అర్చకులు కొత్త పేరు నిర్ణయించారు. భగవాన్ శ్రీరామచంద్రమూర్తిని ఇక నుంచి ‘బాలక్ రామ్’‌గా పిలవనున్నారు. ఐదేళ్ల వయసున్న బాల రాముడిగా దర్శనమిస్తున్నందున ఈ పేరును(Ayodhya Ram New Name) డిసైడ్ చేశామని పురోహితుడు అరుణ్ దీక్షిత్ తెలిపారు. వారణాసికి చెందిన అరుణ్ దీక్షిత్ ఇప్పటివరకు చాలా ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలలో పాల్గొన్నారు. ఇక రామాలయంలోని కొత్త విగ్రహం మంత్రముగ్ధులను చేసేలా ఉంది. 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని  మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. ఆరు నెలల పాటు అకుంఠిత దీక్షతో విగ్రహాన్ని మలిచారు.మైసూరు, హెచ్​డీ కోటె తాలుకాలోని గుజ్జెగౌడనపురలో ఈ కృష్ణ శిల లభ్యమైంది. రామ్​దాస్ అనే స్థానిక కాంట్రాక్టర్ వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా ఈ రాయి బయటపడింది. రాయి నాణ్యతను పరిశీలించి అయోధ్య ఆలయం ట్రస్టీలకు రామ్​దాస్ సమాచారం ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

రాముడి విగ్రహం తయారీకి వాడిన కృష్ణ శిల 250 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని  బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్ డైరెక్టర్ హెచ్ఎస్ వెంకటేశ్ తెలిపారు.భారతీయ ఆనకట్టలు, అణు విద్యుత్ ప్లాంట్ల కోసం రాళ్లను పరీక్షించడానికి ఏర్పడిన నోడల్ ఏజెన్సీయే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్. బాలరాముడి విగ్రహం కోసం వినియోగించిన రాయి చాలా మన్నికైనదని వెంకటేశ్ తెలిపారు. ఈ ఉష్ణ మండలంలో వాతావరణ వైవిధ్య నిరోధకతను కలిగి ఉన్న పురాతనమైన రాయి అని తెలిపారు. రామమందిరాన్ని అత్యంత నాణ్యమైన రాళ్లతో నిర్మించారని… వేలాది సంవత్సరాలు నిలిచేలా ఈ మందిరాన్ని కట్టామని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. దాదాపు 4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఉద్భవించిందని శాస్త్రవేత్తల అంచనా. దాదాపు 14 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై మానవుడు కదలాడినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతారు. మానవులు – హోమో సేపియన్స్  వయస్సు 3,00,000. కానీ రాముడి విగ్రహం తయారీకి వాడిన ఈ కృష్ణ శిల వయస్సు మాత్రం 2.5 బిలియన్ సంవత్సరాలు.

Also Read :Local Train Accident : ముగ్గురు రైల్వే సిబ్బందిపైకి దూసుకెళ్లిన రైలు.. ఏమైందంటే ?

విగ్రహం చెక్కడానికి ఆరు నెలల సమయం

రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన 38 ఏళ్ల అరుణ్ యోగి రాజ్ చెక్కారు. ఈ విగ్రహాన్ని రూపొందించడానికి అతనికి ఆరు నెలల సమయం పట్టింది. ఇతను చెక్కిన ఇతర ప్రసిద్ధ కళాఖండాలలో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న 30 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఒకటి.