Chilkur: హనుమాన్ ఆలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం వ్యక్తి

  • Written By:
  • Updated On - April 24, 2024 / 09:54 PM IST

Chilkur: ప్రసిద్ధ చిల్కూరు బాలాజీ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామం త్వరలో వార్తల్లోకి రానుంది. కొత్తగా నిర్మించిన హనుమాన్ ఆలయానికి ఒక ముస్లిం గ్రామస్థుడు 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పర్యవేక్షించడం కోసం ముఖ్య అతిథిగా  చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఆహ్వానించారు. హనుమాన్ దేవాలయం కోసం తన స్థలంలో సుమారు 5 గుంటలు (600 చదరపు గజాలు) విరాళంగా ఇచ్చాడు. సలావుద్దీన్  గొప్ప ఉదార గుణాన్ని మెచ్చుకుంటూ చాలా కొనియాడుతూ జై శ్రీరామ్ నినాదాలు చేశారు.

తనకున్న భూమిని విరాళంగా అందించడంతో చాలామంది అభినందనలు తెలిపారు. మతపరమైన విద్వేషాలతో ఉడికిపోతున్న ఈ రోజుల్లో  సలావుద్దీన్ చేసిన ఈ దానం మరింత మెచ్చుకోదగినది. సామరస్యానికి  ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది. ఓ ముస్లిం వ్యక్తి భూమి ఇవ్వడంతో రామభక్తులు అభినందలు తెలిపారు.