Site icon HashtagU Telugu

Sabarimala Temple: శబరిలో విషాదం.. క్యూ లైన్‌లో కుప్పకూలిన బాలిక చికిత్స పొందుతూ మృతి

Sabarimala temple

Sabarimala temple

Sabarimala Temple: కేరళలో విషాదం చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిరీక్షిస్తూ 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. గుండె సంబంధిత సమస్యతో బాలిక మృతి చెందినట్లు తెలుస్తుంది. చాలా సేపు క్యూలో నిరీక్షిస్తున్న సమయంలో బాలిక ఒక్కసారిగా కుప్పకూలింది. బాలికను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక గత మూడేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నది. కాగా భద్రతా చర్యలను పటిష్టం చేయడంలో భాగంగా సన్నిధానంలో ప్రత్యేక రెస్క్యూ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే వైద్య సేవలు అందిస్తామన్నారు.

Also Read: Birla Open Minds School : అయ్యప్ప మాల ధరించిన చిన్నారిని అనుమతించని స్కూల్ యాజమాన్యం