Site icon HashtagU Telugu

Navratri: నవరాత్రుల్లో ఏ రోజు ఏ పువ్వులు సమర్పించాలో తెలుసా?

Navratri

Navratri

హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. నవరాత్రి వేడుకలలో నేడు మొదటి రోజు. అక్టోబర్ మూడవ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇక ఈ పవిత్రమైన రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో అత్యంత భక్తిశ్రద్ధలతో వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. దీనితో పాటు అమ్మవారిని పూజించడానికి వివిధ రోజులలో వివిధ పుష్పాలను సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. అమ్మవారి తొమ్మిది రూపాలు వివిధ రంగుల పువ్వులను ఇష్టపడతారు.

తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలను సమర్పించడం వల్ల భక్తుల కోరికలన్నీ దుర్గాదేవి తీరుస్తుంది. మరి ఏ ఏ రోజు ఏ ఏ పుష్పాలతో పూజించాలి అన్న విషయానికి వస్తే.. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని గులాబీ మల్లె పువ్వులతో పూజించడం మంచిది. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తారు. ఇక రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిని రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక ఈ రోజున అమ్మవారికి తెల్ల రంగు పువ్వులను సమర్పించడం మంచిది. అంతే కమలం మల్లె పువ్వులు సమర్పించడం మంచిది. ఇక మూడవరోజు అమ్మవారిని ఎరుపు రంగు పూలు మందార పువ్వులతో పూజించడం మంచిది. మూడో రోజు అమ్మవారు చంద్రగంటా రూపంలో దర్శనం ఇస్తారు. ఇక నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండా దేవిగా దర్శనం ఇస్తారు.

ఇక ఈ రోజున అమ్మవారికి బంతి పువ్వులతో పూజ చేయడం మంచిది. ముఖ్యంగా పసుపు రంగు బంతి పువ్వులతో పూజించడం మంచిది. ఇక నవరాత్రులలో ఐదవ రోజు తల్లి స్కందమాతగా అమ్మవారిని పూజిస్తారు. స్కందమాత ఎరుపు, పసుపు పువ్వులను ఇష్టపడుతుంది. అందుకే నవరాత్రి ఐదవ రోజున ఎర్ర గులాబీలు, పసుపు బంతి పువ్వులను సమర్పించడం చాలా పవిత్రమైనది. ఇక ఆరవ రోజు అమ్మవారి కాత్యాయని దేవిగా దర్శనమిస్తుంటారు. ఈ అమ్మవారికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం. నవరాత్రులలో ఏడవ రోజు కాళరాత్రి దేవికి అంకితం చేయబడింది. కమలం, మల్లెపూలంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇక ఎనిమిదవ రోజు అమ్మవారు మహాగౌరీ దేవీగా దర్శనం ఇస్తారు. ఈ అమ్మవారికి తెల్ల పువ్వులు అంటే ఇష్టం కాబట్టి మల్లె పువ్వులు, తెలుపు రంగులో ఉండే పువ్వులను సమర్పించడం మంచిది. ఇంకా తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్ధి ధాత్రి రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని గులాబీ పువ్వులతో పూజించడం మంచిది.