మామూలుగా చాలామంది దేవుళ్లను పూజించేటప్పుడు తెలిసి తెలియక ఆ దేవుళ్లకు సమర్పించకూడనటువంటి వస్తువులను నైవేద్యాలను పువ్వులను సమర్పిస్తూ ఉంటారు. వాటి వల్ల పూజ చేసిన ఫలితం దక్కకపోగా దేవుళ్ళ ఆగ్రహానికి లోనవుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం కూడా ఒకటి. శివలింగానికి పొరపాటున కూడా ఏడు వస్తువులను అస్సలు సమర్పించకూడదట. ఏమిటి, అవి సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శివలింగం పరమశివునికి ప్రతిరూపం.
శివలింగాన్ని సరిగ్గా ఆచారాలతో విధివిధానాలతో పూజిస్తే, పరమశివుడు మెచ్చి మీ కోరికలన్నీ తీరుస్తారు. శివలింగాన్ని పూజించటం వలన ఇతర దేవతలను కూడా మెప్పించవచ్చట. పరమేశ్వరుడికి సమర్పించకూడని వాటిలో పసుపు కూడా ఒకటి. ఎందుకంటే పసుపు స్త్రీల అందాన్ని పెంపొందించే వస్తువుగా పేరు పొందింది. శివలింగం పరమశివునికి ప్రతిరూపం. పరివర్తని ఏకాదశిరోజున ఇలా పూజిస్తే విష్ణు అనుగ్రహంతో కష్టాలు బాధలు తొలగి మోక్షం పొందుతారు తులసి ఇంకా ఏ పూజకైనా, మొదలు పెట్టేముందు భక్తుడు శుద్ధిగా స్నానం చేయాలి. అదేవిధంగా శివలింగానికి ఎప్పుడు కూడా తులసి ఆకులను సమర్పించకూడదు. కేవలం బిల్వపత్రాలను మాత్రమే సమర్పించాలని చెబుతున్నారు.
అలాగే పరమేశ్వరుడికి ఎప్పుడు కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు. కొబ్బరికాయను కొట్టవచ్చు కానీ శివలింగానికి మాత్రం కొబ్బరి నీటిని సమర్పించకూడదట. అలాగే చంపా శివలింగం పరమేశ్వరుని ప్రతిరూపం కాబట్టి ఆయనకు ఇష్టమైన తెల్లని పువ్వులను శివలింగానికి సమర్పించవచ్చట. ఖేవ్డా చంపా పువ్వులను మాత్రం పెట్టకండి ఎందుకంటే వాటిని శివుడు శపించాడని నమ్ముతారు. కుంకుమ తిలకం శివలింగానికి కుంకుమ తిలకం ఎప్పుడూ వాడవద్దు. భక్తులు కానీ పార్వతీ, గణేషుడి విగ్రహాలకు దీన్ని వాడతారు. సమర్పించే దేన్నీ మీరు తినవద్దు లేదా తాగవద్దు భక్తులు శివలింగానికి సమర్పించే దేన్నీ తినకూడదు, తాగరాదు. అది చెడ్డశకునాన్ని తెచ్చి, అదృష్టం, డబ్బు , ఆరోగ్యం నష్టమవుతాయి. స్టీలు స్టాండు అభిషేకానికి ఎప్పుడూ స్టీలు స్టాండు వాడకూడదట. అలాగే మీరు శివలింగాన్ని ఇంట్లో వుంచుకున్నట్లయితే, దానితో ఎప్పుడూ జలధార ఉండాలని గుర్తుంచుకోవాలి. జలధార లేకుండా శివలింగాన్ని పూజిస్తే, అది నెగటివ్ శక్తులను ఆకర్షిస్తుందట.