7 Horse Painting: ఇంట్లో పరిగెత్తుతున్న ఏడు గుర్రాల చిత్రం పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

వాస్తు శాస్త్రంలో పరుగెతత్తుతున్న ఏడు తెల్ల గుర్రాల చిత్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ చిత్రాన్ని చాలా అదృష్టంగా భావిస్తారు. వాస్త

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 10:00 PM IST

వాస్తు శాస్త్రంలో పరుగెతత్తుతున్న ఏడు తెల్ల గుర్రాల చిత్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ చిత్రాన్ని చాలా అదృష్టంగా భావిస్తారు. వాస్తు ప్రకారం మీ ఇల్లు లేదా కార్యాలయంలో 7 పరుగెత్తే గుర్రాల చిత్రాన్ని లేదా పెయింటింగ్‌ను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ పెయింటింగ్ ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతిని తీసుకురావడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా అదృష్టానికి ఐశ్వర్యానికి కూడా చిహ్నంగా భావించాలి. వీటి సంఖ్య ఏడు అయితే అవి ఉద్యోగం లేదా వ్యాపారంలో అభివృద్ధిని తీసుకుని వస్తాయి. ఇది ఆర్థిక పరిస్థితి, సంపద పురోగతికి దారితీస్తుంది. పరుగెత్తే ఏడు గుర్రాలు విజయానికి చిహ్నంగా పరిగణించబడుతున్నాయి. ఏడు సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంఖ్య 7 శుభం, అదృష్టంగా పరిగణించబడుతుంది.

ఇంద్రధనస్సులో 7 రంగులు ఉంటాయి. వివాహం సమయంలో సప్తపది అంటే.. హోమం చుట్టూ 7 సార్లు తిరుగుతారు. అంతేకాదు వివాహం కూడా 7 జన్మల బంధంగా చెప్పబడింది.. ఆకాశ గంగలో 7 సప్త ఋషులు కూడా ఉన్నారు. సూర్య భగవానుడి రథంలో 7 గుర్రాలు కూడా ఉన్నాయి. న్యూమరాలజీలో కూడా 7వ సంఖ్య జనన సంఖ్యగా ఉన్న పిల్లలను చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ కారణంగా 7 తెల్లని పెరుగేత్తే గుర్రాల పెయింటింగ్ చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది. ఈ పెయింటింగ్‌ను సరైన దిశలో ఉంచినట్లయితే.. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయం లభిస్తుంది. అదేవిధంగా ఇంటికి ఉత్తర దిశలో 7 తెల్లని పెరిగెట్టే గుర్రాల పెయింటింగ్‌ను ఉంచడం శుభప్రదంగా బావించాలి. ఇలా చేయటం వలన ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి,ఆర్థిక లాభం ఉంటుంది. 7 గుర్రాల రథంపై సూర్య భగవానుడు ప్రయాణించే పెయింటింగ్ లేదా చిత్రం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

ఈ పెయింటింగ్‌ను ఇంటికి తూర్పు దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సమాజంలో పేరు తెచ్చుకోవాలన్నా కీర్తి, గౌరవం కావాలన్నా ఇంటి దక్షిణ దిశలో పరుగెత్తే గుర్రాల పెయింటింగ్ ను ఏర్పాటు చేసుకోవాలి.పరిగెత్తే గుర్రాల పెయింటింగ్‌ను ఇంట్లోకి తీసుకురావడానికి ముందు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఫొటోలోని గుర్రాలు తాడుతో కట్టినట్లు ఉండకూడదు. అలాగే మీ ఆఫీసులో పరుగెత్తే గుర్రాల పెయింటింగ్‌ను పెట్టుకోవాలనుకుంటే ఆ గుర్రాలు చిత్రం ఆఫీసు లోపల ఎదురుగా ఉండాలి. ఈ పెయింటింగ్ ఆఫీసులో దక్షిణ గోడపై మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.