Site icon HashtagU Telugu

Friday : 7 శుక్రవారాలు ఇలా చేస్తే చాలు.. లక్ష్మీదేవి తలుపు తట్టడం ఖాయం?

Mixcollage 30 Jan 2024 06 51 Pm 1789

Mixcollage 30 Jan 2024 06 51 Pm 1789

మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు అన్నది చాలా అవసరం. ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్క వ్యవహారం కూడా డబ్బుతో కూడుకున్నదే. ఆ డబ్బే లేకపోతే మనిషిని మనిషిగా కూడా గుర్తించడం లేదు. అందుకే చాలామంది డబ్బు సంపాదించాలి అనే రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. కష్టపడినా కూడా వచ్చిన డబ్బులు చేతికి అందినట్టే అంది చేజారి పోతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు కొన్ని రకాల ఆ పరిహారాలు పాటించాల్సిందే. ముఖ్యంగా శుక్రవారం రోజు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక కలిగి మీరు ఆర్థికపరమైన సమస్యలు ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడవచ్చు.

మీ ఇంట్లో ధనలక్ష్మి పెరగాలన్నా మీ ఆదాయం కూడా రెట్టింపు కావాలంటే కొన్ని పరిష్కారాలు చేయాలి. ప్రధానంగా 2 ప్రత్యేక పనులు చేయడం వల్ల అదృష్టం ఇంటి తలుపులు తడుతుంది. సిరి సంపదలకు లోటు ఉండదు. అందుకోసం వరుసగా 7 శుక్రవారాలు పరిష్కారం చేయడం వల్ల ఇంట్లో ఆర్ధిక సమస్యలు తీరుతాయి. అప్పుల బాధ తగ్గతుంది. ముందుగా మీ ఇంట్లో తయారు చేసిన రొట్టే లేదా చపాతీని పెనంపై ఉంచాలి. దానిపై కుంకుమ, పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని రాయాలి. దానిపై మూడు లవంగాలు వేయాలి. ఆ రొట్టెను ఇంటి టెర్రస్ మీద ఉంచాలి. ఇలా ఏడు శుక్రవారాలు ఇలా చేస్తే మీ డబ్బు కష్టాలు తొలగిపోతాయి. అదనంగా మీకు అనుకోకుండా డబ్బు వస్తుందనే నమ్మకం ఉంది.

లక్ష్మీదేవి సంపద శ్రేయస్సను ప్రసాదించే దేవతగా కొలుస్తాం. కనుక మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజూ ఎర్రటి పూలతో పూజించాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీ పాదాలకు ఎర్రని పువ్వులు సమర్పించాలి. పాలతో తీపి ప్రసాదం అందించాలి. దీంతో మీ ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయని నమ్మకం. పుష్పించే చెట్టు ఆకులను హనుమంతుడికి నైవేద్యంగా పెడితే మన సమస్యలన్నీ తీరుతాయి. ఈ ఆకులను నైవేద్యంగా పెట్టి పూజిస్తే పుణ్యఫలాలు లభిస్తాయి. ప్రధానంగా ఆ ఆకులపై ఎప్పుడూ స్వీట్లు వేస్తే డబ్బులు వస్తాయి.