Site icon HashtagU Telugu

Vasthu and Gold: ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మేస్తే చెడు జరుగుతుందా? పూర్తి వివరాలు!

Gold- Silver Price

Gold

భారతదేశంలో భారతీయులు బంగారానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తారో మనందరికి తెలిసిందే. మరి ముఖ్యంగా డబ్బు తరువాత బంగారం మాత్రమే విలువైనదిగా పరిగనిస్తారు. అయితే బంగారం అన్నది ఒక మూలకం అలాగే విలువైన లోహం కూడా స్త్రి లు బంగారాన్ని ఆలంకరణకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బంగారం ఒక రసాయనిక మూలకం. అయితే అప్పట్లో దీనిని ఒక ద్రవ్యంగా ఉపయోగించేవారు. మన దేశంలో బంగారం ఎంతలా ఉపయోగిస్తున్నారు అంటే బంగారం వినియోగంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది అంటే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు.

భారతీయులు దీన్ని నగదుగా కూడా ప్రత్యామ్నాయంగా కొన్ని సందర్భాల్లో పరిగణిస్తారు. అంతేకాదు బంగారు ఆభరణాలను ధరించడం హోదాకు చిహ్నంగా కూడా భావిస్తారు. ఇకపోతే వాస్తు ప్రకారం బంగారాన్ని సొంతం చేసుకుంటే, వ్యక్తిత్వంపై విశ్వాసం పెరుగుతుంది. అలాగే మనం ఎప్పుడు పడితే అప్పుడు బంగారాన్ని అమ్మరాదని వాస్తుశాస్త్రం తెలుపుతోంది. బంగారానికి రాజరిక వ్యవస్థకి అవినాభావ సంబంధం ఉందట. వాస్తు శాస్త్ర ప్రకారం బంగారం మన వ్యక్తిత్వానికి ఆత్మవిశ్వాసాన్ని జోడిస్తుందట.

బంగారం బహు శక్తిమంతమైన లోహం. స్వల్ప వాస్తుదోషం ఉన్న ప్రదేశాలలో దోష నివారణకు బంగారాన్ని ఉపయోగిస్తారు. అలాగే మనకు అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు మనం బంగారం అమ్మాలనుకుంటాం, కాని అటువంటి సమయంలో దైవిక శక్తులను ఆకర్షించడంలో బంగారం తోడ్పడుతుంది. మన అవసరాన్ని ఆసరాగా చేసుకుని, బంగారం అమ్మేటప్పుడు తరుగు, రామి , తయారి చార్జీలు మొదలైన పేర్లతో మనకు రావలసిన సొమ్మును వ్యాపారస్తులు కాజేస్తారు. కనుక బంగారం అమ్మేటప్పుడు ఇటువంటి నష్టాలకు ముందుగానే మనం సిద్దపడి ఉండాలి. ఇక బంగారం మనలో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలుగజేసి మనపై మనకు నమ్మకాన్ని చిగురింపచేస్తుంది. బంగారాన్ని నష్టపోవడమంటే మనపై మనం నమ్మకాన్ని కోల్పోవడమే అని చెప్పవచ్చు.