Site icon HashtagU Telugu

Wallet: డబ్బుకు ఎలాంటి లోటు ఉండకూడదు అంటే పర్సులో ఈ ఐదు ఉండాల్సిందే.. అవేంటో తెలుసా?

Wallet

Wallet

డబ్బు సంపాదించడం కోసం ఎంతో కష్టపడాలి. కానీ అదే డబ్బు ఖర్చు పెట్టడానికి కొన్ని నిమిషాలు చాలు. అయితే కొంతమంది డబ్బు సంపాదించి ఎంత మిగుల్చుకోవాలి అనుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటారు. చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. ఇలా ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు పర్సులో ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల వస్తువులను ఉంచుకుంటే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండవని చెబుతున్నారు. ఆ వస్తువులు ఏమిటి ఆ వస్తువులు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..

ఇందులో మొదటిది బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఈ ఆకును పర్సులో ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి వస్తుందట. డబ్బు కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అయితే శుభ్రంగా చిరిగిపోకుండా ఉన్న ఆకును మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు. పర్సులో ఉండాల్సిన వస్తువులలో రెండవది ఎర్ర దారం. మంగళ గ్రహ దోష నివారణ కోసం పర్స్ లో ఎర్ర దారం ఉంచుకోవాలని చెబుతున్నారు. ఈ పవిత్ర దారం జీవితంలో ప్రశాంతత, ఐశ్వర్యం తెస్తుంది. దీన్ని ఉంచుకునేటప్పుడు లక్ష్మీదేవిని స్మరించడం తప్పనిసరి అని చెబుతున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో గవ్వలు కూడా ఒకటి. అలాగే పర్స్ లో ఉంచుకోవాల్సిన వాటిలో ఈ గవ్వలు కూడా ఒకటి. పర్సులో ఒకటి లేదా మూడు గవులను ఉంచుకోవడం వల్ల అవి డబ్బును ఆకర్షించి డబ్బుకు సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడేస్తాయట.

అలాగే పర్సులో ఉంచుకోవాల్సిన వస్తువులలో నాలుగవది వెండి నాణెం. పర్సులో వెండి నాణెం ఉంచుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుందట. ఇది డబ్బు ఐశ్వర్యం, శుభాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే పర్సులో దాల్చిన చెక్క ముక్క ఉంచుకుంటే ఆర్థికంగా వృద్ధి చెందవచ్చట. దీని వాసన సానుకూల శక్తిని తెచ్చి చెడు శక్తులను దూరం చేస్తుందని చెబుతున్నారు. అయితే ఈ వస్తువులను పరిశీలిలో పెట్టుకునేటప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించి ఆమె అనుగ్రహం కావాలని వేడుకోవాలట. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని డబ్బుకు లేటు లేకుండా ఉండాలని అమ్మవారిని పూజిస్తూ వాటిని పర్స్ లో పెట్టుకోవాలని చెబుతున్నారు.