Lucky Zodiac Signs: నవరాత్రుల టైంలో ఈ 5 రాశుల వాళ్ళ అదృష్టం మెరుస్తదట!!

దేవీ శరన్నవరాత్రులు 2022 సెప్టెంబర్ 26న ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తాయి. నవరాత్రులలో దుర్గా దేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు.

Published By: HashtagU Telugu Desk
Zodiac

Zodiac

దేవీ శరన్నవరాత్రులు 2022 సెప్టెంబర్ 26న ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తాయి. నవరాత్రులలో దుర్గా దేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. నవరాత్రి రోజుల్లో ఉపవాసం ఉండటం, దుర్గా దేవిని పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు ఉన్న నవరాత్రుల టైం ఈసారి ప్రధానంగా 5 రాశుల వాళ్లకు బాగా కలిసి రానుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* వృషభ రాశి

నవరాత్రుల టైంలో ఈ రాశి వారు తమ వృత్తిలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక బలాన్ని కూడా పొందవచ్చు. ఉద్యోగస్తులకు మరియు వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం.

* వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. ధన లాభాలు కూడా ఉండవచ్చు. పెట్టుబడులు కూడా లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు బాగుంటాయి.

* కుంభ రాశి

కుంభ రాశి వారు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మరియు వారి పూర్తి మద్దతు ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. స్నేహితులు సహాయం చేస్తారు. మీ పెట్టుబడులతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

* కన్య రాశి

కన్య రాశి వారు కుటుంబం మరియు స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు మరియు వారి పూర్తి మద్దతు పొందుతారు. వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సానుకూల దృక్పథం అవసరం. వివాహిత దంపతులకు శుభవార్తలు అందుతాయి. అయితే ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలకు తొందరపడకండి.

* మకరరాశి

మకరరాశి వారు అమ్మవారి అనుగ్రహం వల్ల నవరాత్రులలో అనేక అభివృద్ధిని చూస్తారు. మీరు సానుకూల ఆలోచనలతో అన్ని సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో సత్సంబంధాలు బాగుంటాయి. ఈ కాలంలో, ఆత్మ సంతోషంగా ఉంటుంది. మిత్రులతో అనుబంధం బాగుంటుంది.

  Last Updated: 26 Sep 2022, 10:22 PM IST