Ayodhya Temple Lock : వామ్మో…అయోధ్య రామ మందిరానికి ఎంత పెద్ద తాళమో..!!

అయోధ్య రామ మందిరం (Ayodhya Temple) ప్రత్యేకతలు ఎన్ని చెప్పిన తక్కువే..ప్రతిదీ ఓ విశేషమని చెప్పాలి.. మందిరంలో ఉండే ఆణువణువూ భక్తితో కానుకగా ఇచ్చేది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది రాముడి ఫై భక్తితో ఏదొక కానుకను అందజేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో కానుకలు అయోధ్య కు చేరుకోగా..తాజాగా రామ మందిరం కోసం అతి పెద్దదైన తాళం (Lock) ను సిద్ధం చేసి తమ భక్తిని చాటుకున్నారు ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌ జ్వాలాపురికి చెందిన […]

Published By: HashtagU Telugu Desk
Ayodya Ram Mandir Lock

Ayodya Ram Mandir Lock

అయోధ్య రామ మందిరం (Ayodhya Temple) ప్రత్యేకతలు ఎన్ని చెప్పిన తక్కువే..ప్రతిదీ ఓ విశేషమని చెప్పాలి.. మందిరంలో ఉండే ఆణువణువూ భక్తితో కానుకగా ఇచ్చేది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది రాముడి ఫై భక్తితో ఏదొక కానుకను అందజేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో కానుకలు అయోధ్య కు చేరుకోగా..తాజాగా రామ మందిరం కోసం అతి పెద్దదైన తాళం (Lock) ను సిద్ధం చేసి తమ భక్తిని చాటుకున్నారు ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌ జ్వాలాపురికి చెందిన సత్యప్రకాష్‌ శర్మ కుటుంబ సభ్యులు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రపంచంలోనే అతి పెద్ద తాళాన్ని వీరు సిద్ధం చేసి అయోధ్య రామ మందిరానికి కానుకగా ఇచ్చారు. ఆలయానికి 4 వందల కిలోలున్న (400-kg) తాళాన్ని కానుకగా ఇవ్వడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ తాళం చెవి మూడు అడుగుల నాలుగు అంగుళాలు పొడవు ఉండగా… దీని బరువు వచ్చేసి 30 కిలోలు ఉంది. సత్యప్రకాష్ శర్మతోపాటు ఆయన భార్య రుక్మణి, కుమారుడు మహేష్ చంద్ కలిసి ఈ తాళాన్ని తయారు చేశారు. తాళం తయారీకి రూ.5 లక్షలు రూపాయలు ఖర్చు అయ్యినట్లు తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 17న మోడీ పుట్టినరోజు సందర్భంగా సత్యప్రకాష్, అతని భార్య రుక్మణి ప్రధానిని కలిసి, తాము స్వయంగా తయారుచేసిన ఆరు కిలోల తాళాన్ని మోడీకి బహుమతిగా అందజేశారు. అలాగే అయోధ్య రామ మందిరానికి 400 కిలోల బరువు కలిగిన భారీ తాళం తయారు చేస్తామని , ఆలయ ప్రారంభోత్సవ సమయానికి అందజేస్తామని ఆ దంపతులు మోడీకి హామీ ఇచ్చారు. ఇచ్చినట్లే నేడు అయోధ్య కు ఈ తాళాన్ని పంపించారు. కాకపోతే గత డిసెంబర్ లో సత్యప్రకాష్ గుండెపోటుతో మరణించారు. అయినప్పటికీ భర్త కోరిక మేరకు తాళాన్ని తయారు చేసి అయన కోరిక ను , అలాగే మోడీకి ఇచ్చిన మాట ను నిలబెట్టుకున్నారు.

Read Also : TDP : వంగ‌వీటి రాధా టార్గెట్‌గా వాట్స‌ప్‌లో పోస్టులు.. సెంట్ర‌ల్ టీడీపీలో వేడెక్కిన రాజ‌కీయం

  Last Updated: 20 Jan 2024, 07:01 PM IST