Ayodhya : కాలినడకన వచ్చి అయోధ్య రామయ్య ను దర్శించుకున్న ముస్లింలు

అయోధ్య లోని బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం అయోధ్య (Ayodhya ) లో ఈ నెల 22 న ఆవిష్కృతం అయ్యింది. అయోధ్యలో బాలక్ రామ్ (Balak Ram) విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఆ మరుసటి రోజు నుండి రామయ్య ను దర్శించుకునే అవకాశం ఇవ్వడం తో ప్రతి రోజు లక్షల్లో భక్తులు రామయ్య […]

Published By: HashtagU Telugu Desk
Ayodya Musilm

Ayodya Musilm

అయోధ్య లోని బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం అయోధ్య (Ayodhya ) లో ఈ నెల 22 న ఆవిష్కృతం అయ్యింది. అయోధ్యలో బాలక్ రామ్ (Balak Ram) విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఆ మరుసటి రోజు నుండి రామయ్య ను దర్శించుకునే అవకాశం ఇవ్వడం తో ప్రతి రోజు లక్షల్లో భక్తులు రామయ్య ను దర్శించుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా లక్నో నుంచి ఆరు రోజుల పాదయాత్రను ముగించుకుని 350 మంది ముస్లిం భక్తులు (Muslim devotees) అయోధ్యకు చేరుకుని రామాలయంలో దర్శనం చేసుకున్నారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ (Muslim Rashtriya Manch – MRM) నేతృత్వంలో ఈ బృందం జనవరి 25 న లక్నో నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించిందని MRM మీడియా ఇన్‌ఛార్జ్ షాహిద్ సయీద్ బుధవారం తెలిపారు.

350 మంది ముస్లిం భక్తులతో కూడిన ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేస్తూ తీవ్రమైన చలికి కూడా లెక్కచేయకుండా దాదాపు 150 కిలోమీటర్ల మేర కాలినడకన అయోధ్య (Ayodhya) కు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ఆరు రోజుల తర్వాత, అరిగిపోయిన పాదరక్షలు, అలసిపోయిన కాళ్లతో భక్తులు అయోధ్యకు చేరుకుని కొత్తగా ప్రతిష్టించిన రామ్ లల్లా విగ్రహానికి మొక్కులు చెల్లించుకున్నారని సయీద్ తెలిపారు. ఇది ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, సామరస్య సందేశాన్ని అందించిందని తెలిపారు.

Read Also : CM Revanth Reddy: త్వరలో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్

  Last Updated: 31 Jan 2024, 09:05 PM IST