Site icon HashtagU Telugu

Chandra And Surya Grahan: వచ్చే ఏడాది పితృ పక్షంలో మళ్లీ చంద్రగ్రహణం ఏర్పడుతుందా..? 2025లో గ్రహణం తేదీలు ఇవేనా..?

Chandra And Surya Grahan

Chandra And Surya Grahan

Chandra And Surya Grahan: ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం భాదో మాసం పౌర్ణమి తిథి అంటే 18 సెప్టెంబర్ 2024 నాడు ఉదయం సూర్యోదయం తర్వాత సంభవించింది. కనుక ఇది భారతదేశంలో కనిపించలేదు. పితృపక్షం మొదటి తర్పణం, పిండ దానం భాదో మాసం పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఇప్పుడు వచ్చే ఏడాది 2025లో చంద్రగ్రహణం (Chandra And Surya Grahan) ఏర్పడనుంది. వైదిక జ్యోతిష్యం లెక్కల ప్రకారం 2025లో రెండు చంద్రగ్రహణాలు వస్తాయి. వచ్చే ఏడాది ఎన్ని చంద్రగ్రహణాలు ఎన్ని ఏర్పడబోతున్నాయో, ఏయే తేదీల్లో సంభవిస్తాయో, వచ్చే ఏడాది పితృ పక్షంలో మళ్లీ చంద్రగ్రహణం వస్తుందో తెలుసుకుందాం.

2025 సంవత్సరం చంద్రగ్రహణం

వైదిక జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం మాదిరిగానే రెండు చంద్రగ్రహణాలు ఏర్పడబోతున్నాయి. వచ్చే ఏడాది మార్చి 14, 2025న తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం..హోలికా దహన్ ఈ రోజు. 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 25, 2024న హోలీ రోజున ఏర్పడింది.

ఇక 2025లో రెండవ చంద్రగ్రహణం విషయానికి వస్తే.. ఈ ఏడాది మాదిరిగానే అది కూడా సెప్టెంబర్ నెలలోనే రానుంది. 2025 సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న ఏర్పడనుంది. 2025లో వచ్చే ఈ రెండో చంద్రగ్రహణం కూడా ఈ సంవత్సరంలాగే పితృ పక్షంలోనే జరగడం కూడా యాదృచ్ఛికమే.

Also Read: India vs Bangladesh: నేటి నుంచి భార‌త్ వ‌ర్సెస్ బంగ్లా టెస్టు సిరీస్ ప్రారంభం.. వ‌ర్షం ప‌డే ఛాన్స్‌..?!

2025లో వచ్చే చంద్రగ్రహణాలు రెండూ పాక్షిక చంద్రగ్రహణం. ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు కూడా పాక్షిక చంద్రగ్రహణాలు. ఈ చంద్రగ్రహణాల దృశ్యమానతకు సంబంధించినంతవరకు మార్చి 14, 2025న సంభవించే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. సెప్టెంబర్ 7, 2025న సంభవించే చంద్రగ్రహణం భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది.

హిందూ గ్రంధాలు, జ్యోతిష్యం ప్రకారం చంద్రగ్రహణం కంటికి ప్రత్యక్షంగా కనిపించదు. 2025 సంవత్సరంలో సంభవించే మొదటి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి. దీనికి సూతక్ కాలం లేదు. 2025 సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి దాని సూతక్ కాలం సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది.

2025లో సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?

2025లో వచ్చే సూర్యగ్రహణం విషయానికొస్తే.. 2024లో మాదిరిగానే 2025లో కూడా రెండు సూర్యగ్రహణాలు ఏర్పడే అవకాశాలు ఉండటం యాదృచ్ఛికం. మార్చి 29న తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. దీని తరువాత 2025 రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న సంభవిస్తుంది. ఇది కూడా పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది. ఈ రెండు సూర్యగ్రహణాలు భారతదేశంలో కనిపించవు. అందువల్ల వాటికి మతపరమైన ప్రాముఖ్యత లేదు. వాటికి సూతక్ కాలం కూడా ఉండదు.