2024 Khairatabad Ganesh First Pic : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి (Khairatabad Ganesh) విగ్రహా స్వరూపాన్ని నిర్వాహకులు ఈరోజు చూపించారు. విగ్రహానికి శిల్పి చిన్నస్వామి రాజేందర్ నేత్రాలంకరణ పూర్తిచేశారు. 70 అడుగుల శ్రీసప్తముఖ మహాశక్తి గణపతి (Sri Saptamukha Maha Shakti Ganapathi)గా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి వరల్డ్ ఫేమస్
ఇక మనదేశంలో ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితి (Ganesh Chaturthi) ప్రత్యేకతే వేరు. గణేష్ పండగ వస్తుందంటే చాలు ఊరు వాడ గణేష్ విగ్రహాలతో సందడి గా మారుతుంటాయి. దేశంలో గణేశ్ చతుర్థిని ఘనంగా జరుపుకునే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంటే ఆ తర్వాత స్థానంలో తెలంగాణలోని హైదరాబాద్ ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా నగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి వరల్డ్ ఫేమస్. గతేడాది ఇక్కడి గణపయ్య తన ఎత్తుతో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు.
ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు 70 అడుగుల ఎత్తు
ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తవుతుండటంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సప్తముఖ మహాగణపతి పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్.. గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. భక్తులు జయజయ ధ్వానాలు నడుమ ఉత్సవ కమిటీ ప్రతినిధులు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి బలి తీశారు. ఈసారి అయోధ్య రాముడు కూడా గణపయ్య చెంత ఉండడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తున్నారు. ఈసారి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడం, శని, ఆదివారాలు రెండు సార్లు రావడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్‌లు పూజలు చేయనున్నారు.
Read Also : NTR On Mokshagna Entry : మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపిన జూ. ఎన్టీఆర్