Site icon HashtagU Telugu

10,000 Devotees: యమునోత్రి పై చిక్కుకుపోయిన 10,000 మంది యాత్రికులు.. ఏం జరిగిందంటే!!

Yanumotri

Yanumotri

దాదాపు 10వేల మందికిపైగా యాత్రికులు ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ -యమునోత్రి జాతీయ రహదారిపై చిక్కుకుపోయారు. యమునోత్రి ఆలయానికి వెళ్లే రహదారిపై ఉండే భద్రతా గోడ కుప్పకూలింది. దీంతో యమునోత్రి కి వెళ్లే మార్గంలో తొలుత(7 కిలోమీటర్ల ముందు) ఉండే “జానకి చట్టి” పట్టణం వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ వాహనాల్లో దాదాపు పది వేలమందికిపైగా యాత్రికులు చిక్కుకుపోయారు. 24 బస్సులు, 15 మినీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

ఇందులోని యాత్రికులు అందరినీ సమీపంలోని ఆశ్రమానికి, సైంచట్టి అతిథి గృహానికి తీసుకెళ్లారు. అయితే ఈ రహదారులను పునరుద్ధ రించడానికి కనీసం మూడు రోజులు పట్టొచ్చు. ఒక ట్రాక్టర్ ట్రాలీ, రెండు జేసీబీ యంత్రాలు, టిప్పర్‌, 15 మంది కూలీల సాయంతో ఈ మార్గాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందు బుధవారం కురిసిన భారీ వర్షాలకు సయనచట్టి, రణచట్టి ప్రాంతాల మధ్య ఉన్న రహదారి కొట్టుకుపోయింది. దాంతో ఆ రోడ్డును 24 గంటలు మూసేసి తిరిగి గురువారం సాయంత్రమే తెరిచారు. కానీ ఇంతలోనే మరోసారి రోడ్డు కూలిపోవడంతో మళ్లీ శుక్రవారం ఇబ్బంది తలెత్తింది.