Site icon HashtagU Telugu

Corona Virus: కరోనా వైరస్ గురించి అసలు నిజం చెప్పేసిన వ్యూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త.. అసలు వాస్తవం ఇదే?

Norovirus

Norovirus

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తాన్ని గడగడ లాడించింది ఈ కరోనా మహమ్మారి. ఇప్పటికీ కరోనా మహమ్మారి కొన్ని ప్రదేశాలలో అంతకంతకు కోరలు చాస్తూ చాప కింద నీరులో విస్తరిస్తోంది. కొన్ని దేశాలలో ఈ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టగా చైనా దేశంలో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ కరోనా కి సంబంధించిన విషయం గురించి ఒక శాస్త్రవేత్త అసలు విషయాన్నీ బయట పెట్టేశారు. చైనాలోని వివాదాస్పద వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ లో పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త, ఎపిడెమిలాజిస్ట్ రీసెర్చర్ ఆండ్రు హుప్స్ ఒక విషయాన్ని వెల్లడించారు.

కోవిడ్ 19 మనిషి తయారు చేసిన ఒక వైరస్ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా వూహాన్ అనే ల్యాబ్ నుంచి ఆ వైరస్ లీక్ అయిందని తెలిపారు. తాజాగా ఆయన రాసిన ది ట్రూత్ అబౌట్ వూహాన్ అనే పుస్తకంలో ఈ విషయాలను రాసుకొచ్చారు. చైనాలోని కరోనా వైరస్ ల అధ్యయనానికి అమెరికా ఫండింగ్ చేస్తుండడమే వైరస్ పుట్టుకకు కారణమని శాస్త్రవేత్త పేరుకున్నట్టు ఒక న్యూస్ పేపర్ కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ ఆధీనంలోని వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి కోవిడ్ వైరస్ లీక్ అయింది అంటూ రెండేళ్ల క్రితం న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన కథనాన్ని ఆయన ప్రస్తావించారని పేర్కొంది.

అయితే ప్రయోగం చేసే సమయంలో తగిన భద్రతలు తీసుకోకపోవడం వల్లే వైరస్ లీక్ అయిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నట్టు తెలిపింది. కాగా శాస్త్రవేత్త ఆండ్ర్యూ హుఫ్స్ న్యూయార్క్ కేంద్రంగా అంటువ్యాధుల పై అధ్యయనం నిర్వహించే స్వచ్ఛంధ సేవాసంస్థ ఎకోహెల్త్ అలయెన్స్‌కు మాజీ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారని న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ పేర్కొంది. కాగా కరోనా వ్యాప్తి వ్యూహాన్ ల్యాబే మూలకారణమంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఈ ఆరోపణలను చైనా ప్రభుత్వాధికారులతోపాటు వూహాన్ ల్యాబ్‌ సిబ్బంది కూడా కొట్టివేససింది.

Exit mobile version