కోవిడ్ తర్వాత వచ్చే మానసిక సమస్యలను హెయిర్ తో చెప్పేయొచ్చా?

కోవిడ్ తర్వాత మీకు మానసిక సమస్యలు వస్తున్నాయా? అయితే ఈ సమాధానం మీ వెంట్రుకలు చెప్పేస్తాయట. అవును ఇది నిజం. కొత్త అధ్యయనం ప్రకారం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరించారు. వెంట్రుకల్లో ఉన్న ఎక్కువ కార్టిసోల్ హార్మోన్ మనుష్యుల మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు ఒక కొత్త అధ్యయనంలో వివరించారు.

  • Written By:
  • Updated On - October 26, 2021 / 11:51 AM IST

కోవిడ్ తర్వాత మీకు మానసిక సమస్యలు వస్తున్నాయా? అయితే ఈ సమాధానం మీ వెంట్రుకలు చెప్పేస్తాయట. అవును ఇది నిజం. కొత్త అధ్యయనం ప్రకారం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరించారు. వెంట్రుకల్లో ఉన్న ఎక్కువ కార్టిసోల్ హార్మోన్ మనుష్యుల మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు ఒక కొత్త అధ్యయనంలో వివరించారు.
చైల్డ్ డెవలప్‌మెంట్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో, న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబి (NYUAD) పరిశోధకులు, మహమ్మారి వల్ల ఎక్కువ ఆటంకాలు ఎదుర్కొన్న కుటుంబాలలోని తల్లులు, పిల్లలలో హెయిర్ కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. ఇది టఫ్ సిట్యువేషన్ వచ్చినపుడు స్టార్ట్ అవుతుంది. అలాంటి సమయాల్లో అనవసరమైన లేదా హానికరమైన ఫంక్షన్లను అరికట్టడానికి ఇది శరీరానికి సిగ్నల్ ఇస్తుంది.
ఈ అధ్యయనాన్ని.. తక్కువ ఆదాయం కలిగిన 52 మంది జోర్డాన్, ఇంకా చిన్న పిల్లలతో ఉన్న సిరియన్ కుటుంబాలు జోర్డాన్‌లో చేశారు. మహమ్మారికి ముందు ఈ బృందం మరొక అధ్యయనంలో పనిచేసింది. దీని కోసం 2019 లో జోర్డాన్‌లో తల్లులు, పిల్లల కార్టిసాల్ పరీక్షల నుంచి నమూనాలను ఉపయోగించారు. అదే కుటుంబాలు ఒత్తిడి శరీరధర్మ శాస్త్రం, కుటుంబ పనితీరుతో పాటు మానసిక ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చిన మొదటి తొమ్మిది నెలలు కార్టిసాల్ ద్వారా.. పిల్లల్లో వచ్చిన ప్రతికూల మార్పులు అంచనా వేయడానికి పనికొస్తాయని తెలిసింది. ఇది ఎక్కువగా పేద వర్గాలలోనే కనిపించిందని అధ్యయనం వివరించింది. 2020లో కరోనాతో బాధపడిన పేద కుటుంబాలలో ఈ ప్రతికూల మార్పులు ఎక్కువ ఉన్నట్లు వెంట్రుకలలో ఉన్న కార్టిసాల్ సాంద్రతల ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. కరోనా మహమ్మారి వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిందని ఈ పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు వివరించారు. వీటి వల్ల దీర్ఘకాలిక ప్రభావాలను కూడా కలిగి ఉంటాయని అధ్యయనం తేల్చింది. అయితే ఇవన్నీ కరోనాతో ఎక్కువ కాలం బాధపడిన వారిలోనే ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.