Site icon HashtagU Telugu

Covid19: కరోనా ఖేల్ ఖ‌త‌మ్ అంటున్న లాన్సెట్ మెడికల్ జర్నల్

Corona The Lancet

Corona The Lancet

ప్ర‌పంచంలో ఉన్న అన్ని దేశాల‌పై క‌రోనా వైర‌స్ పంజా విసిరిన సంగ‌తి తెలిసిందే. కోవిడ్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌జీవ‌నం ఒక్క‌సారిగా స్థంబించిపోయింది. థ‌ర్డ్ వేవ్‌లో క‌రోనా తీవ్ర‌త త‌గ్గినా, ఫ‌స్ట్ అండ్ సెకండ్ వేవ్స్‌లో ఏ మాత్రం క‌నిక‌రం చూపించ‌ని కరోనా ఎన్నో ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ తీవ్ర‌త కాస్త త‌గ్గినా, క‌రోనా పేరు చెప్ప‌గానే యావ‌త్ ప్ర‌జానీకం భ‌యంతో ఉలిక్కిప‌డుతున్నారు.

అయితే కరోనాతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రపంచ దేశాలకు లాన్సెట్ మెడికల్ జర్నల్ పత్రిక తాజాగా ఓ తీపి కబురు చెప్పింది. కరోనా వైర‌స్ ఎండెమిక్‌గా (అంటువ్యాధి) మారినట్లు తాజాగా లాన్సెట్ మెడికల్ జర్నల్ ప‌త్రిక ప్రచురించింది. ఇక లాన్సెట్ మెడికల్ జర్నల్ పత్రికను వైద్య, ఆరోగ్య‌ రంగానికి విశ్వసనీయమైన పత్రికగా మంచి గుర్తింపు ఉంది. ఈ క్ర‌మంలో ఆ పత్రికే కరోనా వైర‌స్ అంతం గురించి తాజాగా లాసెట్ చేసిన ప్రచురణ క‌రోనా కార‌ణంగా వ‌ణికిపోతున్న ప్ర‌జ‌ల‌కు కాస్త ఊర‌ట కల్గించేలా ఉంది.

ఇంత‌క ముందు ఒక మహమ్మారిగా విరుచుకుపడిన క‌రోనా, ప్ర‌స్తుతం ఆ శక్తిని కోల్పోయిందని ఆ పత్రిక ప్ర‌చురించింది. ఇక‌ముందు మ‌నిషిని స్వల్పంగా అనారోగ్యానికి గురిచేసే శక్తి మాత్రమే క‌రోనా వైర‌స్‌కు ఉంటుంద‌ని లాన్సెట్ మెడికల్ జర్నల్ రాసుకొచ్చింది. క‌రోనా శక్తిని కోల్పోయినా, సీజనల్ వ్యాధుల రూపంలో మనతోనే ఉంటుందని ఆ ప‌త్రిక‌ పేర్కొంది. సాధారణ అంటు వ్యాధిలా మ‌రిన క‌రోనా వల్ల తీవ్ర అనారోగ్యం ఉండకపోవచ్చని, కానీ అంద‌రూ మాస్కులు ధరించ‌డం మాన‌వ‌ద్ద‌ని, కరోనా పట్ల మన జాగ్రత్తలో మనం ఉండటం మేలని లాన్సెట్ మెడికల్ జర్నల్ ప‌త్రిక సూచించింది.