Covid-19: కెనడా వెళ్లే పౌరులకు కోవిడ్ టీకా తప్పనిసరికాదు..!!

కోవిడ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈనేపథ్యంలో కోవిడ్ 19 వ్యాప్తి తగ్గుతున్న దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఇప్పుడిప్పుడే ఆంక్షలు ఎత్తివేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 08:46 AM IST

కోవిడ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈనేపథ్యంలో కోవిడ్ 19 వ్యాప్తి తగ్గుతున్న దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఇప్పుడిప్పుడే ఆంక్షలు ఎత్తివేస్తున్నాయి. అయితే కెనడాకు వెళ్లే పౌరులకు గుడ్ న్యూస్ చెప్పింది. కెనడాకు వెళ్లాలంటే కోవిడ్ టీకా తప్పనిసరి కాదంటూ…టీకాను రద్దు చేసే అవకాశం ఉందంటూ ప్రభుత్వ వర్గాలు తెలిపారు. కెనడా ప్రభుత్వ వర్గాల ప్రకారం, కెనడియన్ ప్రభుత్వం సెప్టెంబర్ చివరి నాటికి దేశంలోకి ప్రవేశించే వ్యక్తుల కోసం COVID-19 వ్యాక్సిన్ అవసరాన్ని తొలగించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

కాగా కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సెప్టెంబర్ 30 నాటికి ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో దీనిని ఖరారు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. అంతేకాదు ఇకపై ArriveCan యాప్‌లో వ్యాక్సినేషన్ గురించిన సమాచారాన్ని అందించాల్సిన అవసరం లేదని తెలిపింది. కానీ కెనడా ఎయిర్ పోర్టులో మాత్రం COVID-19 పరీక్షను తొలగించదని స్పష్టం చేసింది.