Third Wave: థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమన్న తెలంగాణ ప్రభుత్వం

కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. కావాల్సిన మందులు, బెడ్స్ సిద్ధం చేశామని, కరోనా ఇన్ఫెక్షన్ నివారించే విషయంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

  • Written By:
  • Updated On - December 1, 2021 / 11:18 AM IST

కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. కావాల్సిన మందులు, బెడ్స్ సిద్ధం చేశామని, కరోనా ఇన్ఫెక్షన్ నివారించే విషయంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

సెకండ్ వేవ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్స్ పెంచడంతో పాటు ప్రయివేట్ హాస్పిటల్స్ లో సైతం బెడ్స్ సంఖ్య, ఆక్సిజన్ బెడ్స్ పెంచినట్లు ఆరోగ్య శాఖ అధికారుల సమాచారం.

దక్షిణాఫ్రికా వేరియంట్ ఓమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రంతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరణాలు లేకున్నా కొత్త వేరియంట్ తో ప్రమాదం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులను అలెర్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం థర్డ్ వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపింది.