ఇండియలో కరోనా కేసులు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 7,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ తాజాగా బులెటిన్ విదుదల చేసింది. ఇక భారత్‌లో కరోనా కారణంగా నిన్న 223 మంది ప్రాణాలు కోల్పోగా, కరోనా మహమ్మారి నుంచి 14,123 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల విషయంలో కాస్త ఊరట కల్గిస్తున్నా మరణాల సంఖ ఆందోళణ కల్గిస్తుంది.
ఇక దేశంలో ఇప్పటి వరకు 4,29,38,599 కరోనా బారిన పడగా, 4,23,38,673 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,14,246 మంది మరణించారని కేంద్ర వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఇండియాలో 85,680 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.90 శాతం ఉందని, అలాగే ఇండియాలో రికవరీ రేటు 98.60 శాతానికి పైగా ఉందని కేంద్ర తెలిపింది. ఇకపోతే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో దేశంలో ఇప్పటివరకు 1,77,79,92,977 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.