Oxford Study: మీకు తెలుసా..కరోనాను మాస్కులు కంట్రోల్ చేస్తాయట.

మాస్కులు అనేవి ఎంత వరకూ ఆపగలగుతాయని చాలా మందిలో ఉన్న డౌట్ ఉంది.

  • Written By:
  • Publish Date - October 31, 2021 / 12:00 PM IST

మాస్కులు అనేవి ఎంత వరకూ ఆపగలగుతాయని చాలా మందిలో ఉన్న డౌట్ ఉంది. మరికొంతమంది అసలు మాస్కులు వల్ల ఉపయోగమే లేదని వాధిస్తారు. ఇలాంటి వారికి సమాధానంగా కోవిడ్ కు మాస్కులు చెక్ పెడతాయని యూకేలోని ఆక్స్ ఫర్డ్ ప్రూవ్ చేసి మరీ చెప్పింది. అయితే ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ అందరినీ మాస్కులు వాడమని చెబుతోంది. BMJ ఓపెన్‌లో ప్రచురించబడిన ఆక్స్‌ఫర్డ్ యొక్క లెవర్‌హుల్మ్ సెంటర్ ఫర్ డెమోగ్రాఫిక్ సైన్స్ పరిశోధకులు మాస్క్‌ల సమర్థత మీద, జనాభా లెక్కన అధ్యయనం చేయగా.. ముసుగులు ధరించిన వ్యక్తులలో కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్ గణనీయంగా తక్కువగా ఉందని చెప్పింది.
UKలో మహమ్మారి మొదటిసారిగా ఎంటర్ అయినపుడు కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ల కోసం నాన్-ఫార్మాస్యూటికల్ కానివాటి గురించి ఒక శీర్షిక వచ్చింది. జోక్యాలకు కట్టుబడి ఉండడాన్ని ప్రభావితం చేసే అంశాలు’ అనే శీర్షికతో రూపొందించిన అధ్యయనంలో 18 సంవత్సరాల నుంచి 64ఏళ్ల మధ్య వయస్సు గల 1,00,138 మంది వ్యక్తులకు 4,09,009 ముక్కు, గొంతు శుభ్రపరచు పరీక్షలు చేసింది. తర్వాత మే 10, 2020 నుండి ఫిబ్రవరి 2, 2021 లో మరోసారి పరీక్షలు చేసింది. ఈ పరీక్షలలో బయటకు వెళ్లేటపుడు మాస్క్ ధరించిన వాళ్లలో తక్కువ ఇన్ఫెక్షన్‌ను ఉన్నట్లు గుర్తించింది.

ఈ విషయాన్ని పరిశోధకులలో ఒకరైన UKలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని లెవర్‌హుల్మ్ సెంటర్ ఫర్ డెమోగ్రాఫిక్ సైన్స్ నుండి డాక్టర్ మెలిండా సి మిల్స్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో ప్రత్యేకించి చెప్పారు. మాస్కు వేసుకోవడంతో రిస్క్ తగ్గుతున్నా.. ఇంటి నుంచి బయటకు వెళ్లేటపుడు, ఉద్యోగాలకు వెళ్లేటపుడు, ఆఫీసులలో, ఇతర వాహనాలలో, గుంపులుగా ఉన్నపుడు సామాజిక దూరం పాటించాలి కానీ ఎక్కడా అవి కనిపించడం లేదు. దీంతో కోవిడ్ మళ్లీ పంజా విసురుతోందని డాక్టర్ మెలిండా చెప్పారు. ఇలాంటపుడు చాలా వరకూ మాస్కు మనుష్యులను కాపాడుతుందని .. అయితే అదే పూర్తి రక్షణ కాదని స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.