Omicron : బూస్టర్ డోస్‌పై WHO కీలక ప్రకటన

ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ర‌క్షించుకోవ‌డానికి బూస్ట‌ర్ డోస్ అవ‌స‌రమా కాదా అనేది అస్ప‌ష్టంగా ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ తెలిపింది. అన్ని దేశాలు టీకా నిల్వ‌ల‌ని ఎక్కువ‌గా ఉంచుకోవ‌ద్ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ సూచించింది.

  • Written By:
  • Publish Date - December 10, 2021 / 11:02 AM IST

ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ర‌క్షించుకోవ‌డానికి బూస్ట‌ర్ డోస్ అవ‌స‌రమా కాదా అనేది అస్ప‌ష్టంగా ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ తెలిపింది. అన్ని దేశాలు టీకా నిల్వ‌ల‌ని ఎక్కువ‌గా ఉంచుకోవ‌ద్ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ సూచించింది. బూస్ట‌ర్ డోస్ వినియోగంపై స్ప‌ష్టమైన ఆధారాలు లేకుండా టీకా నిల్వ‌లు చేయ‌డంతో వ్యాక్సిన్ కొర‌త ఏర్ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు.

ఓమిక్రాన్ వైర‌స్ వ్యాప్తి ఎలా ఉండ‌బోతుందో అని ప్ర‌పంచ దేశాలు వారి జ‌నాభా ర‌క్ష‌ణ కోసం వ్యాక్సిన్లు నిల్వ చేసే అవ‌కాశం ఉంద‌ని డబ్ల్యూహెచ్‌ఓ వ్యాక్సిన్‌ చీఫ్‌ కేట్‌ ఓబ్రెయిన్ తెలిపారు. క‌రోనా మొద‌టి ద‌శ‌లో ర‌క్ష‌ణ కోసం వ్యాక్సిన్ రెండు మోతాదులు అందించిన మాదిరిగానే ఒమిక్రాన్ వేరియంట్ స‌మ‌యంలో కూడా రక్ష‌ణ కోసం బూస్ట‌ర్ డోస్ అవ‌స‌ర‌మ‌ని ఫైజ‌ర్ బ‌యోఎన్ టెక్ వ్యాక్సిన్ అవ‌స‌ర‌మ‌ని ఆ కంపెనీ తెలిపిన నేప‌థ్యంలో ఈమె ఆ వ్యాఖ్య‌లు చేశారు.

ఓమిక్రాన్ నియంత్ర‌ణ‌కు అద‌న‌పు డోస్ లు ప్ర‌యోజ‌నం పోందుతాయ‌ని తేలింద‌ని ఓబ్రియ‌న్ తెలిపారు. అయితే దీనికి స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. తీవ్రమైన కోవిడ్ వ్యాధి నుండి రక్షించడానికి అదనపు మోతాదులు అవసరమని చాలా తక్కువ ఫ‌లితాలు చెప్తున్న‌ప్ప‌టికీ ఇంకా కొన్ని దేశాలలో చాలా మంది కోవిడ్ ఫ‌స్ట్ డోస్ వ్యాక్సిన్ ని తీసుకోలేదు. సంప‌న్న దేశాలు త‌మ ప్ర‌జ‌ల కోసం వ్యాక్సిన్ నిల్వ‌ల కోసం చేసే ప్ర‌య‌త్నాలు మ‌హమ్మారి ఎక్కువ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ హెచ్చ‌రిస్తుంది.