Site icon HashtagU Telugu

Covid 19: కరోనాతో చనిపోయాడు అనుకున్నారు.. రెండేళ్ల తరువాత తిరిగి రావడంతో?

Covid 19

Covid 19

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు. అయితే ఇందులో బాధపడాల్సిన విషయం మరొకటి ఏమిటంటే చాలామంది ఇంట్లో వారు చనిపోయిన వారిని కనీసం ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయారు. చాలామంది కోవిడ్ పాజిటివ్ అని చెప్పి హాస్పటల్ తీసుకుని వెళ్లి తీరా చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు తెలియకుండా దహన సంస్కారాలు చేసేశారు.

కరోనా సమయంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. చాలామంది కుటుంబ సభ్యులను ఆఖరిసారి కూడా చూసుకోలేక పోవడంతో గుండెలు విలసేలా రోధించారు. యుక్త వయసు వారు ముసలి వయసు వారు చిన్న ఏజ్ వారు కూడా మరణించారు. అయితే ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి దగ్గు ముఖం పడుతుంది అనుకుంటున్నా క్రమంలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరొకసారి అంతకంతకూ విజృంభిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా అదే స్థాయిలో మరణ కేసుల ఆ సంఖ్య కూడా నమోదు అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మధ్యప్రదేశ్లో ఒక షాకింగ్ పెట్టిన అలాగే సంతోషపడే ఘటన కూడా జరిగింది. రెండేళ్ల క్రితం ఒక వ్యక్తికి కరోనా మహమ్మారి సోకడంతో మృతి చెందాడు. దాంతో ఆసుపత్రి వర్గాలు మృతదేహాన్ని అప్పగించగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు. మధ్యప్రదేశ్ లోని దార్ జిల్లాలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 2021లో కరోనా రెండో సమయంలో కమలేష్ పాటిదార్ అనే 35 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు.

అతన్ని గుజరాత్ లోని వడోదర లో హాస్పిటల్లో చేర్చారు. కరోనా మహమ్మారితో పోరాడుతూ అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వెళ్లిపోయారు. ఇది జరిగి దాదాపు రెండేళ్లు అయ్యింది. అయితే చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒకవైపు షాక్ కి గురయ్యారు మరోవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ ఉన్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. దానికి అతను సమాధానం చెప్పకపోవడంతో వెంటనే అధికారులను ఆశ్రయించారు. కమలేష్ ను విచారించిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వస్తుంది అని పోలీసులు వెల్లడించారు..