Covid-19 : కోవిడ్ పై యుద్ధంలో భారత్ అతిపెద్ద విజయం…!!

కరోనా...రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని గజగజలాడించింది. ఇప్పటికీ పలు దేశాల్లో కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - October 6, 2022 / 11:38 AM IST

కరోనా…రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని గజగజలాడించింది. ఇప్పటికీ పలు దేశాల్లో కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే భారత్ లో మాత్రం కోవిడ్ కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు దేశంలో 2529కేసులు మాత్రమే నమోదు అయినట్లు కేం్దర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు, మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,46,04,463కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,745కు చేరింది.

కాగా గడిచిన 24 గంటల్లో 3553 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,43,436 చేరుకుంది. 1,22,057మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు 89.62కోట్ల మందికి కోవిడ్ టెస్ట్ లు పూర్తి చేశారు. ప్రస్తుతం దేశంలో 32,282 కేసులున్నాయి. మొత్తం కేసుల్లో 0.07శాతం కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 98.74శాతంగా రికవరీ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని వెల్లడించారు.