Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. 12 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు..!

దేశంలో కోవిడ్ కేసులు (Covid Cases) వేగంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 12 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

  • Written By:
  • Publish Date - April 20, 2023 / 10:30 AM IST

దేశంలో కోవిడ్ కేసులు (Covid Cases) వేగంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 12 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం గురువారం (ఏప్రిల్ 20) 12,591 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. దేశంలో కొత్త కొవిడ్‌ అలలు విజృంభించబోతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ఇలాంటి ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 65286 యాక్టీవ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీలో గురువారం దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,767 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య రెట్టింపు.

ఢిల్లీలో 1,767 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ సంక్రమణ కారణంగా ఆరుగురు రోగులు మరణించారు. ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ఆధారంగా ఈ సమాచారం అందింది. డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం.. నగరంలో ఇన్‌ఫెక్షన్ రేటు 28.63 శాతం. దేశ రాజధానిలో కోవిడ్ నుండి మరో ఆరుగురు మరణించిన తరువాత ఇక్కడ అంటువ్యాధితో మరణించిన వారి సంఖ్య 26,578కు పెరిగింది. మంగళవారం ఢిల్లీలో 1,537 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్ రేటు 26.54 శాతంగా నమోదైంది.

Also Read: Indian Army : భారత సైనికులకు చైనీస్ భాష నేర్పుతున్నతేజ్‌పూర్ యూనివర్సిటీ, ఇండియన్ ఆర్మీతో ఒప్పందం

మహారాష్ట్రలో 1,100 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు రోగులు సంక్రమణ కారణంగా మరణించారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. కొత్త కేసుల రాకతో రాష్ట్రంలో మొత్తం సోకిన వారి సంఖ్య 81,58,393కి పెరిగిందని, నలుగురు వ్యక్తులు ఇన్‌ఫెక్షన్‌కు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,48,489కి పెరిగిందని బులెటిన్‌లో చెప్పబడింది. రాష్ట్రంలో కోవిడ్-19 చికిత్స పొందుతున్న వారి సంఖ్య 6,102కి పెరిగింది.