Site icon HashtagU Telugu

Corona Cases: దేశంలో మరోసారి కరోనా పంజా.. 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు

Corona Virus India

Corona Virus India

గత 24 గంటల్లో భారతదేశంలో కొత్త కరోనా కేసులు (Corona Cases) గణనీయంగా పెరిగాయి. మంగళవారం ఏడు వేలకు మించి కొత్త కేసులు నమోదు కాగా, బుధవారం 10,542 కేసులు తెరపైకి వచ్చాయి. క్రియాశీల రోగుల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. బుధవారం ఉదయం వరకు దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 63 వేల 562కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. కరోనా కారణంగా 38 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 4,4250,649కి పెరిగింది.

Also Read: Heatwave alert: ఈ 9 రాష్ట్రాల్లో దంచికొట్టనున్న ఎండలు, ఇంటి నుంచి బయటకు వెళ్తంటే ఇవి మీవెంట ఉండాల్సిందే.

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేట్ 26.54 శాతానికి చేరిందని పేర్కొంది. ఢిల్లీలో సగటున రోజూ వెయ్యికి పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయని వివరించింది. మూడు రోజులుగా కరోనా కొత్త కేసులు పదివేల లోపే నమోదయ్యాయి. అయితే, బుధవారం మరోమారు కేసులు 10 వేలు దాటడంపై అధికారవర్గాల్లో ఆందోళన రేపింది.