కరోనా పెరుగుతున్న వేళ నాలుగో డోసుపై కీలక సూచనలు

తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ పడగవిప్పుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అలజడి మళ్లీ మొదలైంది.

  • Written By:
  • Publish Date - December 28, 2022 / 09:40 PM IST

తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ పడగవిప్పుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అలజడి మళ్లీ మొదలైంది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకోవాలంటూ కేంద్రం సూచిస్తోంది. ముక్కు ద్వారా తీసుకునే ఇన్కోవాక్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్, దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ హెడ్ ఎన్ కే అరోరా ప్రజలను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేశారు.

ఫస్ట్ బూస్టర్ డోసు తీసుకునే వాళ్లకు మాత్రమే ముక్కు ద్వారా తీసుకునే టీకాను రెకమెండ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇది వరకే ప్రికాషన్ డోసు తీసుకున్న వారు ఈ నాసిల్ వ్యాక్సిన్ ను ఇవ్వకుండా ఉండాలని తెలిపారు. ప్రికాషన్ డోసు తీసుకోని వారికి మాత్రమే ఈ టీకాను వేసుకోమని సూచినట్లు తెలిపారు. నాలుగో డోసు కింద ఈ వ్యాక్సిన్ ను అనుమతించమని ఆయన వెల్లడించారు.

వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని ఆయన కోరారు. ఎవరైనా పదేపదే యాంటిజెన్ వంటి వ్యాక్సిన్ వేసుకుంటూ ఉంటే ఆ వ్యక్తి శరీరం స్పందించకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని అరోరా తెలిపారు. శరీరంలో స్పందనలు తగ్గిపోతాయని సూచించారు. అందువల్లే మొదట రెండో డోసు వేసుకునేందుకు 6 నెలల గ్యాప్ ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత జనాలు 3 నెలల గ్యాప్ తో వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా సరైన ఫలితం రాలేదని తెలిపారు. అందుకే 4వ డోసు వేసుకోవద్దని సూచిస్తున్నట్లు హెచ్చరించారు.

18 ఏళ్లు పైబడిన వారంతా కూడా నాసిల్ వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ అరోరా సూచించారు. రెండు ముక్కు రంద్రాల్లోనూ నాలుగు చుక్కల చొప్పున వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుందని, 0.5 ఎంఎల్ వ్యాక్సిన్ ను వేయించుకోవాలని సూచించారు.