COVID – 19 : కోవిడ్ నాసల్ వ్యాక్సిన్.. ఎలా బుక్ చేయాలి? ధర ఎంత?

భారత్ బయోటెక్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ ముక్కు వ్యాక్సిన్‌ iNCOVACCను ప్రైవేట్ ఆసుపత్రులలో రూ. 800 (పన్నులు అదనం)కు విక్రయిస్తామని వెల్లడించింది. ఈ టీకా వేయించుకోవాలని భావించే వారు CoWin పోర్టల్‌లో స్లాట్‌లను ఇప్పుడు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ వ్యాక్సిన్ ని జనవరి నాల్గవ వారంలో దేశంలో విడుదల చేయనున్నారు. కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బల్క్ ఆర్డర్స్ వస్తే ఒక్కో iNCOVACC డోసును కేవలం రూ. 325కే విక్రయిస్తామని చెప్పింది.iNCOVACC టీకా 18 ఏళ్లు పైబడిన వారి కోసం బూస్టర్ డోసుగా రూపొందించబడింది.ఈ నెల ప్రారంభంలోనే.. భారత్ బయోటెక్ నాసికా వ్యాక్సిన్‌ను హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా ఉపయోగించేందుకు సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతి ఇచ్చింది. పొందింది.

భారత్ బయోటెక్ ప్రకటన:

ప్రైమరీ 2-డోస్ షెడ్యూల్‌కు ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ కోవిడ్ (COVID) వ్యాక్సిన్ ఇదేనని భారత్ బయోటెక్ తెలిపింది.3వ దశ ట్రయల్స్ దేశంలోని 14 ప్రదేశాల్లో , హెటెరోలాగస్ ట్రయల్స్ 9 సైట్‌లలో జరిగాయని వివరించింది. వ్యాక్సిన్ ఇచ్చిన వారి లాలాజలంలో గణనీయమైన స్థాయిలో యాంటీబాడీ స్థాయిలు పెరిగాయని ట్రయల్స్ సమయంలో భారత్ బయోటెక్ చెప్పింది. ఎగువ శ్వాసకోశంలో ఉండే మ్యూకోసల్ IgA యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్‌లను తగ్గించడంలో ముక్కు వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని గతంలో వివరించింది. iNCOVACC వాషింగ్టన్ యూనివర్శిటీ, సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. దీన్ని రీకాంబినెంట్ అడెనోవైరల్ వెక్టర్డ్ పద్ధతిలో అభివృద్ధి చేశారు. నాసికా టీకా డోసులు 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉన్నాయని భారత్ బయో టెక్ తెలిపింది.

లక్ష్యాలను మేము సాధించాము:

“ఈ మహమ్మారి సమయంలో మేము నిర్దేశించుకున్న లక్ష్యాలను మేము సాధించాము. మేము రెండు వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌ల నుండి.. రెండు వేర్వేరు డెలివరీ సిస్టమ్‌లతో COVAXIN మరియు iNCOVACC అనే రెండు COVID వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేశాము. వెక్టర్డ్ ఇంట్రానాసల్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ మాకు వేగవంతమైన ఉత్పత్తి అభివృద్ధి, స్కేల్ సామర్థ్యాన్ని అందిస్తుంది. అప్, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీలు మరియు మహమ్మారి సమయంలో సులభంగా మరియు నొప్పిలేకుండా ఇమ్యునైజేషన్ చేసే వీలు ఉంటుంది” అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read:  Corona : మీ దగ్గు, జలుబు కరోనా కొత్త వేరియంట్ వల్లా ? కాదా ? ఇలా తెలుసుకోండి