యూరప్ కోవిడ్ మరణాలపై WHO ఆందోళన.. ఫిబ్రవరి నాటికి?

కరోనాతో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీకుదేలైయ్యాయి.మొదటి,రెండవ దశలో కరోనా వల్ల చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు

  • Written By:
  • Updated On - November 6, 2021 / 11:57 AM IST

కరోనాతో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కుదేలైయ్యాయి. మొదటి, రెండవ దశలో కరోనా వల్ల చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. థర్డ్ వేవ్ రూపంలో కరోనా మరోసారి పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలతో ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్లు వేసుకున్నారు. దాదాపుగా వ్యాక్సినేషన్ పూర్తికావోచ్చింది. అయితే చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ ఇంకా ప్రారంభంకాకపోవడంతో ఇప్పుడు వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా యూరప్ దేశాల్లో కరోనా విజృంభించడంతో భారతీయుల్లో కూడా ఆందోళన కలుగుతుంది.

కరోనా థర్డ్ వేవ్ యూరప్ దేశాల్లో మొదలైందని నిపుణులు అంటున్నారు. కొద్ది రోజులుగా యూరప్ దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. యూరప్ లో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు, మరణాల సంఖ్య ప్రపంచానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికల్లా యూరప్ లో మరో 5 లక్షల కోవిడ్ మరణాలు సంభవించే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది. యూరోపియన్ ప్రాంతంలోని 53 దేశాలలో ప్రస్తుతం వైరస్ ప్రసార వేగం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లూగే అన్నారు. ఒక అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మరో 5లక్షల COVID-19 మరణాలు నమోదయ్యే అవకాశముందని… WHO లెక్కలో యూరోపియన్ ప్రాంతం… మధ్య ఆసియాలోని కొన్ని దేశాలతో కూడా కలిపి 53 దేశాలు మరియు భూభాగాలకు విస్తరించిందని తెలిపారు.