ఇండియాలో కరోనా కేసులు సంఖ్య భారీగా తగ్గాయి. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10 వేల దిగువకు చేరింది. ఈ క్రమంలో దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 8,013 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక భారత్‌లో కరోనాతో నిన్న ఒక్కరోజు 119 మంది ప్రాణాలు కోల్పోగా, 16,765 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా 4,29,24,130 కరోనా పాజిటివ్ కేకసులు నమోదయ్యాయని, అలాగే కరోనా మహమ్మారి కారణంగా 5,13,843 మంది మరణించారని, దీంతో ప్రస్తుతం దేశంలో 1,02,601 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక భారత్‌లో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ రేటు 1.11 శాతం ఉండగా, రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉంది. అలాగే ఇప్పటివరకు దేశంలో 1,77,50,86,335 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.