mRNA కోవిడ్ -19 వ్యాక్సిన్ ఎఫెక్ట్ గర్బిణీలలో ఎలా ఉంటుంది?

ప్రెగ్నెన్సీ టైమ్ లో mRNA కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న మహిళలు తమ పిల్లలకు అధిక స్థాయిలో యాంటీబాడీస్ అందిస్తారని ఒక అధ్యయనం తెలిపింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌ల ప్రభావం సరైన యాంటీబాడీస్, రక్త ప్రోటీన్‌ల ఉత్పత్తిని ప్రేరేపించే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

  • Written By:
  • Updated On - October 26, 2021 / 11:51 AM IST

ప్రెగ్నెన్సీ టైమ్ లో mRNA కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న మహిళలు తమ పిల్లలకు అధిక స్థాయిలో యాంటీబాడీస్ అందిస్తారని ఒక అధ్యయనం తెలిపింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌ల ప్రభావం సరైన యాంటీబాడీస్, రక్త ప్రోటీన్‌ల ఉత్పత్తిని ప్రేరేపించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ నుంచి రక్షించగలదని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ రక్షణ గర్బిణీగా ఉన్న మహిళల నుంచి వారి శిశువులకు చేరుతుందా అనేది మాత్రం ఇంకా పూర్తిగా తేలాల్సి ఉందని వారు చెప్పారు.
అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ మెటర్నల్-ఫెటల్ మెడిసిన్‌లో ఇటీవల ప్రచురించబడిన ఈ అధ్యయనం అప్పుడే పుట్టిన 36మంది శిశువులపై నిర్వహించారు. వీళ్లందరి తల్లులు ప్రెగ్నన్సీ టైమ్ లో ఫైజర్ లేదా మోడర్నా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ తీసుకున్నారు.
కోవిడ్-19 వ్యాక్సిన్‌ల ప్రభావం సరైన యాంటీబాడీస్, రక్త ప్రోటీన్‌ల ఉత్పత్తిని ప్రేరేపించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది మనుష్యులను ఇన్ఫెక్షన్ నుంచి రక్షించగలదని పరిశోధకులు తెలిపారు. యుఎస్‌లోని ఎన్‌వైయు గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నేతృత్వంలోని పరిశోధనా బృందం… పిల్లలు పుట్టినప్పుడు 100శాతం యాంటీబాడీలను కలిగి ఉన్నట్లు చెప్పింది. యాంటీబాడీలు సంక్రమణకు సహజ ప్రతిస్పందనలో భాగంగా ఉత్పత్తి చేయబడతాయి లేదా టీకాల ద్వారా ప్రేరేపించబడతాయి.
యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, ప్రినేటల్ టీకా భద్రతకు పెరుగుతున్న ఆధారాలు ఉంటున్నా కూడా, కేవలం 23 శాతం గర్బిణీలు మాత్రం టీకాలు వేసుకున్నట్లు తేలింది. గర్బధారణ సమయంలో వ్యాక్సిన్‌ల యొక్క ప్రాముఖ్యతతో పాటు తల్లీ, పిల్లలలో తీవ్రమైన అనారోగ్యాన్ని నుంచి కాపాడుతుంది. దీనివల్ల ఒకేసారి రెండు ప్రాణాలను రక్షించే శక్తిని స్ట్రాంగ్ చేస్తూనే ఉన్నాయని NYU లాంగోన్ హెల్త్ ప్రొఫెసర్ ఎస్ రోమన్ అన్నారు. ఇలా పిల్లలు యాంటీబాడీస్‌తో జన్మించగలిగితే, అది వారి జీవితంలోని మొదటి కొన్ని నెలల్లో, వారు అత్యంత ప్రమాదంలో ఉన్నప్పుడు వారిని కాపాడుతుందని రోమన్ చెప్పారు. ఆగస్టు 16 న ప్రచురించిన అధ్యయనంలో గర్బధారణ సమయంలో mRNA టీకాలు సురక్షితమైనవని బలమైన ఆధారాలను ధృవీకరించారు.
ప్రెగ్నెన్సీ టైమ్ లో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో పుట్టుకతో వచ్చే సమస్యలు, పిండానికి కూడా ఎటువంటి లోపాలు లేవని ఆ అధ్యయనంలో తేలింది. తమ పరిశోధనలు గర్బధారణ సమయంలో మహిళలకు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవాలనే సూచించినట్లు తేలిందని పరిశోధకులు చెప్పారు. దీనివల్ల నవజాత శిశువుకు అదనపు రక్షణ లభిస్తుందని ఆయన చెప్పారు. శిశు ప్రతిరోధకాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో, ఎంతకాలం రక్షణ ఉంటుందనే విషయంతో పాటు.. గర్భధారణలో ముందుగానే టీకాలు వేయడం కంటే ఎక్కువ యాంటీబాడీల బదిలీని నిర్ధారించడానికి మరింత అధ్యయనం అవసరమని పరిశోధకులు చెప్పారు.

Follow us