Corona Virus: ఇండియాలో క‌రోనా.. రెండేళ్ల తర్వాత వెయ్యి లోపు కొత్త‌ కేసులు..!

  • Written By:
  • Updated On - April 4, 2022 / 03:14 PM IST

ఇండియాలో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం పడుతోంది. ఈ క్ర‌మంలో గ‌త 24 గంటల్లోకొత్తగా 913 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌ క‌రోనా కార‌ణంగా నిన్న ఒక్క‌రోజు 52 మంది ప్రాణాలు కోల్పోయార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుండి 1316 మంది కోలుకున్నార‌ని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుద‌ల చేసింది.

ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,30,29,044 కోట్ల‌ క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా.. 5,21,358 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. అలాగే ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,24,95,089 కోట్ల మంది క‌రోనా నుంచి కోలుకున్నారని స‌మాచారం. ఇక మ‌రోవైపు దేశంలో ప్ర‌స్తుతం ఇండియ‌లో 13,672 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌పోతే దేశం క‌రోనా పాజిటివిటీ రేటు 0.03 శాతం ఉంది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.76 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 1,84,70,83,279 కోట్లు కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించింది.