Site icon HashtagU Telugu

Corona Virus: క‌రోనా టెర్ర‌ర్.. ప్ర‌పంచంపై మ‌రోసారి పంజా..?

Corona New Variant

Corona New Variant

ప్ర‌పంచాన్ని వ‌ణికించిన క‌రోనా వైర‌స్, కొద్ది రోజులుగా త‌గ్గుముఖం ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌రోసారి ప్ర‌పంచ దేశాల‌పై క‌రోనా పంజా విసురుతుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే క‌రోనా పుట్టినిల్లు అయిన చైనాలో క‌రోనా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఊస‌ర‌వెల్లిలా ఒక్కో వేవ్‌లో ఒక్కో కొత్త వేరియంట్‌తో వ‌ణుకు పుట్టిస్తున్న క‌రోనా దెబ్బ‌కి చైనాలోని అనేక ప్రాంతాల ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నాయి. దీంతో చైనాలో మ‌రోసారి లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు.

మ‌రోవైపు సౌత్ కొరియాలో కూడా క‌రోనా కేసులు పెద్ద ఎత్తున న‌మోద‌వుతున్నాయి. నిన్న ఒక్క‌రోజే ఆ దేశంలో 4 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో కలకలం చెలరేగింది. ఈ క్ర‌మంలో సౌత్ కొరియాలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 6,21,328 కరోనా పాజిటివ్ కేసులు నమోద‌వ‌గా, 429 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయార‌ని, ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు సౌత్ కొరియాలో 82,50,592 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

ఇక ఇజ్రాయిల్‌లో కొత్త కోవిడ్ వేరియంట్‌ కేసులు నమోదు కావడం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఈ క్ర‌మంలో కోవిడ్ 19కు సంబంధించి ఒమిక్రాన్‌తో పాటు దాని ఉప వేరియంట్లు BA.1, BA.2గా రూపాంతరం చెందుతున్నాయ‌ని స‌మాచారం. ఈక్రమంలో ఇజ్రాయిల్‌లో రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయ‌ని అక్క‌డి వైద్య నిపుణులు వెల్ల‌డించారు. ఇక ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ టెస్టులు నిర్వహించాగా, BA.1, BA.2 వేరియంట్లు వెలుగులోకి వచ్చినట్లు స‌మాచారం. అయితే ఆ ఇద్ద‌రిలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో పెద్ద‌గా ఆందోళ చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అక్క‌డి ఇజ్రాయిల్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక‌పోతే మ‌న దేశానికి ప‌క్క‌నే ఉన్న‌ చైనాలో కరోనా కేసులు పెరిగుతున్న క్ర‌మంలో, ఇండియాకు కూడా క‌రోనా ముప్పు తప్పదని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి 75 శాతం మంద‌దికి క‌రోనా వైర‌స్ సోక‌వ‌చ్చ‌ని కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోన్ థర్డ్ వేవ్ రావడానికి ప్రధాన కారణం బీఏ.2 వేరియంట్ అని, ఇప్పటికీ దాని ఆనవాళ్లు ఉంకా కనిపిస్తున్నాయని, అందువల్ల నాలుగో దశ కరోనా వైరస్ వ్యాప్తి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే జూలై నెలలో ఫోర్త్ వేవ్ ప్రారంభంకావొచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్ప‌టికే దేశంలో 4,24,59,939 కరోనా కేసులు న‌మోద‌వగా, 5,16,132 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దీంతో క‌రోనా ఫోర్త్ వేవ్ ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తుండ‌డంతో ప్ర‌పంచ‌ వ్యాపంగా ప్ర‌జలు ఆందోళణ‌ చెందుతున్నారు.