Corona Virus: ఇండియాలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..!

  • Written By:
  • Publish Date - March 19, 2022 / 12:57 PM IST

ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 2,075క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌ క‌రోనా కార‌ణంగా నిన్న ఒక్క‌రోజు 71 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, అలాగే దేశ వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుండి 3,997మంది కోలుకున్నార‌ని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుద‌ల చేసింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,30,06,080 కోట్ల‌ క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, 5,16,352 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,24,61,926 కోట్ల మంది క‌రోనా నుంచి కోరుకున్నార‌ని స‌మాచారం. ఇక మ‌రోవైపు దేశంలో ప్ర‌స్తుతం ఇండియ‌లో 27,802 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌పోతే దేశం క‌రోనా పాజిటివిటీ రేటు 0.56 శాతం ఉంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 1,81,04,96,924 కోట్లు కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించింది. ఇక‌పోతే ఒక‌వైపు దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతున్నా, ఫోర్త్ వేవ్‌లో క‌రోనా వైర‌స్ విరుచుకుప‌డే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చరిక‌లు జారీ చేసింది.