Site icon HashtagU Telugu

Corona Virus: ఇండియాలో క‌రోనా కేసులు.. లేటెస్ట్ రిపోర్ట్ ఇదే..!

Corona India

Corona India

ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా రోజువారీ కేసులు సంఖ్య భారీగా త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే భార‌త్‌లో మంగ‌ళ‌వారం మాత్రం క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. ఈ క్ర‌మంలో నిన్న ఒక్క‌రోజు దేశంలో కొత్తగా 15,102 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక గ‌త 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 278 మంది ప్రాణాలు కోల్పోగా, 31,377 మంది క‌రోనా నుండి కోలుకున్నారు.

ఇండియాలో ఇప్పటి వరకు 4,28,37,473‬ మంది కరోనా బారిన ప‌డ‌గా, 4,21,89,887 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా కారణంగా దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 5,12,622 మంది మరణించార‌ని, దీంతో ప్రస్తుతం దేశంలో 1,64,522 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని కేంద్ర వైద్య‌ ఆరోగ్య‌శాఖ తెలిపింది. ఇండియాలో రోజువారీ క‌రోనా పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉండ‌గా, దేశంలో 1,75,37,22,697 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారని హెల్త్ బులెటిన్ ద్వారా వెల్ల‌డించారు.