Site icon HashtagU Telugu

Corona Virus: బిగ్ రిలీఫ్.. ఇండియాలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..!

Corona India

Corona India

భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గ‌త 24 గంట‌ల్లో దేశం కొత్త‌గా 11,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు క‌రోనా కార‌ణంగా 255 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా క‌రోనా నుండి 4,22,70,482 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇండియాలో ఇప్పటి వరకు 4,29,05,844‬ మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక క‌రోనా వ్యాది బారిన ప‌డిన వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,22,70,482 కోలుగోగా, క‌రోనా కార‌ణంగా దేశంలో నేటి వ‌ర‌కు 5,13,481 మంది మృతి చెందారు. దీంతో ప్ర‌స్తుతం ఇండియాలో 1,21,881 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ క‌రోనా పాజిటివ్ రేటు 1.01 శాతంగా ఉంది. ఇక‌పోతే భార‌త్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. అలాగే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,77,17,68,379 మందికి కరోనా వ్యాక్సినేషన్ జ‌రిగింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.