Site icon HashtagU Telugu

Corbevax Vaccine: 12-14 ఏళ్ళ‌ పిల్ల‌ల‌కు.. మార్చి 16 నుంచి క‌రోనా వ్యాక్సినేష‌న్..!

Covishield Vaccination Risk

Corbevax Vaccin Corona Vaccine

ఇండియాలో క‌రోనా వైర‌స్‌తో పోరాడేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం 180 కోట్ల పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. 12-14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల కోసం తయారుచేసిన కార్బివ్యాక్స్ వ్యాక్సిన్ను ఈనెల 16వ తేదీ నుంచి ఇవ్వనుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేంద్ర ఆరోగ్య శాఖ‌ మంత్రి మనసుఖ్ మాండవీయ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇక ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌ల‌తో పాటు 15-18 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ జరిగిన సంగ‌తి తెలిసిందే. 15-18సం. వయసు ఉన్న వారి కోసం ఈ ఏడాది జనవరి 3న భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ ప్రారంభించడం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పటివరకు 15 నుండి 18 సం. లోపు వారిలో 3.3 కోట్ల మంది ఈ వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లకు కూడా వ్యాక్సిన్లు వేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో మార్చి 16వ తేదీ నుంచి 12-14 ఏళ్ల వయసులోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్‌ డోసు (బూస్టర్ డోసు) మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.