Site icon HashtagU Telugu

Corona: షాకింగ్.. విదేశాల నుంచి వచ్చిన వారిలో 11 కరోనా వేరియంట్లు గుర్తింపు!

Omicron Sub Variant Bf.7 Detected In India

Omicron Sub Variant Bf.7 Detected In India

Corona: తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా టెన్షన్ మొదలైంది. గత కొన్ని రోజులుగా అదుపులో ఉన్న ఈ మహమ్మారి మరో సారి తన పంజా విసిరింది. కొత్త కరోనా వేరియంట్‌ కారణంగా మరోసారి కొవిడ్‌ ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భారత్ లో కూడా ఈ టెన్షన్ ఎక్కువయ్యింది.

చైనా, జపాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 రకం కరోనా వైరస్‌ పలు చోట్ల తన పంజాను విసురుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. విదేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రతి ఒక్కరికీ విమానాశ్రయాలు, పోర్టుల్లో పరీక్షలు చేపడుతూ ఇండియాలోకి దాని ఆనవాళ్లు లేకుండా చూస్తోంది. దేశంలోని ప్రజలకు కూడా ఆ వైరస్ పై అవగాహన కల్పిస్తోంది.

విమానాశ్రయాల్లో చేపట్టిన స్క్రీనింగ్ టెస్టుల్లో గత 11 రోజుల్లో మొత్తం 124 మంది విదేశీ ప్రయాణికుల్లో కరోనా వైరస్‌ ను గుర్తించినట్లు వైద్య నిపుణులు తెలిపారు. డిసెంబర్‌ 23వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు విమానాలు, సీపోర్ట్స్‌, లాండ్‌ పోర్ట్స్‌లల్లో విదేశాల నుంచి వచ్చిన 19,227 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను భారత వైద్య నిపుణులు చేపట్టారు. వారిలో 124 మందికి వైరస్‌ సోకినట్లుగా వెల్లడించారు.

ఒమిక్రాన్‌కు సంబంధించిన 11 రకాల సబ్‌ వేరియంట్లను వారిలో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వైరస్ ను అంతం చేయడానికి వ్యాక్సిన్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నియమాలు, నిబంధనలు పాటించాలని వారు కోరుతున్నారు.