ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 4,194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 255మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 6,208 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది.
ఇక దేశంలో ఇప్పటి వరకు 42,984,261 కరోనా కేసులు నమోదవగా, 5,15,714మంది కరోనా కారణంగా మరణించారు. అలాగే దేశంలో ఇప్పటి వరకు 4,24,26,328 మంది కోరుకున్నారని సమాచారం. ఇక మరోవైపు దేశంలో ప్రస్తుతం ఇండియలో 42,219 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే దేశం కరోనా పాజిటివిటీ రేటు 1.20 శాతం ఉంది. అలాగే రికవరీ రేటు 98.70 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇండియాలో 179.72 కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.