Site icon HashtagU Telugu

Corona : దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. 24 గంటల్లో…?

Covid Variant

Covid Variant

భారతదేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు స్వ‌ల్పంగా పెరుగుతున్నాయి. గ‌త రెండు రోజులుగా కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 4,518 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అంతకుముందు రోజు 4,270 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.గ‌డిచిన 24 గంటల్లో తొమ్మిది మంది క‌రోనా మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా 5,24,701 మంది క‌రోనాతో మరణించారు.గ‌డిచిన‌ 24 గంటల్లో 2,779 మంది రోగులు కోలుకోవడంతో మొత్తం సంఖ్య 4,26,30,852కి చేరుకుంది. ఇప్పుడు రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. దేశంలో రోజువారీ సానుకూలత రేటు 1.62 శాతానికి పెరిగింది. అయితే వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.91 శాతంగా ఉంది.