Corona : నాలుగో విడ‌త క‌రోనా పంజా

ఫోర్ట్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో క‌రోనా కేసులు గత 24 గంటల్లో ఏకంగా 12,213 న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

Published By: HashtagU Telugu Desk
Union Health Ministry

Union Health Ministry

ఫోర్ట్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో క‌రోనా కేసులు గత 24 గంటల్లో ఏకంగా 12,213 న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. పెరుగుతున్న కేసులు ఫోర్త్ వేవ్ కు సంకేత‌మా? అనే ఆందోళ‌న బ‌య‌లు దేరింది. మరోవైపు గత 24 గంటల్లో 7,624 మంది కోలుకోగా, 11 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 58,215 యాక్టివ్ కేసులు ఉండ‌గా, మహారాష్ట్ర నుంచి 4,024 , కేరళ నుంచి 3,488 అత్య‌ధికంగా గ‌త 24 గంట‌ల్లో న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,57,730 గా ఉంది. వీరిలో 4,26,74,712 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు 5,24,803 మంది మృతి చెందారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.35 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.13 శాతంగా, రికవరీ రేటు 98.65 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1.95 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఒక్క రోజే 15,21,942 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కానీ, క‌రోనా కేసులు మాత్రం ఒక్క‌సారిగా పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది..

  Last Updated: 16 Jun 2022, 03:56 PM IST