Site icon HashtagU Telugu

Corona: చైనాలో కరోనా ఐసోలేషన్ క్యాంపుకు నిప్పు.. అసలేం జరిగిందంటే?

Corona

Corona

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాగించింది. లక్షలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది ఈ మహమ్మారి. అయితే క్రమంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గినప్పటికీ చైనా దేశంలో మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కరోనా వైరస్ నుంచి కోరుకుంటున్నా తరుణంలో మరొకసారి చైనా నుంచి కరోనా పంజా విసురుతోంది. దీంతో చైనా దేశం జీరో కోవిడ్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తోంది.

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో చైనా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఆ దేశ ప్రజలు ఆ కఠిన నిబంధనలు తట్టుకోలేక ప్రధాన వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. 1989 ప్రజాస్వామ్య అనుకూల నిరసన తర్వాత చైనాలో అతిపెద్ద నిరసన ఇదే. అక్కడి అధికారులు చైనాలో అత్యధిక జనాభా కలిగిన ఐదవ నగరమైన గ్వాంగ్జౌ లో ప్రకటించిన కరోనా పరిమితులను సడలిస్తున్నటుగా అధికారులు అకస్మాత్తుగా ప్రకటించారు. అయితే ఇంతకుముందు చైనా అధ్యక్షుడు అయిన జి జిన్ పింగ్ ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాలపై దేశవ్యాప్తంగా నిరసనలు ఒత్తిడి కారణంగా ఆంక్షలు తొలగించబడుతున్నాయి.

ఈ విషయంలో చైనా అధ్యక్షుడు ఆ దేశ ప్రజల నిరంతర పోరాటం నుండి వెనక్కి తగ్గారని తెలుస్తోంది. కాగా అక్కడి కరోనా మహమ్మారి నిబంధనలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అక్కడి ప్రజలు కోపంతో కరోనా ఐసోలేషన్ క్యాంపు కు నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తన తప్పులను అంగీకరించకుండా ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నారు అంటూ పలువురు రాజకీయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.