Work From Home: కరోనా ఎఫెక్ట్.. మరోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదా..?

కరోనా పరిస్థితుల దృష్ట్యా కంపెనీలన్నీ మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home)పై ఆలోచనలు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 12:30 PM IST

Work From Home: కరోనాను ప్రపంచం కోలుకుంటుందని అంతా భావిస్తున్న తరుణంలో కొత్తగా వెలుగు చూస్తున్న కొత్త కేసులు మానవాళిని మరోసారి కలవరానికి గురిచేస్తోన్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు కరోనా విషయంలో అప్రమత్తం అవుతున్నాయి. భారత్ లో అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. ప్రజలంతా మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ డ్రైవ్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నాయి. కరోనా పరిస్థితుల దృష్ట్యా కంపెనీలన్నీ మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home)పై ఆలోచనలు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసిన విషయం తెలిసిందే.

కరోనా వచ్చి దాదాపుగా నాలుగేళ్లు పూర్తవుతుంది. ఏడాదికొకటి చొప్పన ఇప్పటికే మూడు వేరియంట్లతో ప్రపంచ దేశాలను మహమ్మారి ఇబ్బందులకు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కరోనా భయం ప్రజలలో మొదలైంది. కొత్తగా వస్తున్న JN. 1 కరోనా వైరస్ ఇంకా ఎన్ని విధ్వంసాలను సృష్టిస్తుందో అని ప్రపంచ దేశాల ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇప్పటికే స్టాట్ అయిన ఈ వేరియంట్‌పై ఆసుపత్రులు, ట్రాన్స్‌పోర్ట్, టూరిజం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Also Read: Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ రీఛార్జ్.. 90 రోజులు వ్యాలిడిటీ..!

ఇదిలా ఉంటే.. ఈ వేరియంట్ తీవ్రత అధికమైతే మళ్లి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. JN. 1 వేరియంట్ తర్వాత పరిస్థితిని చూసి మళ్లీ ఆఫీసులకు రావడంపై నిర్ణయం ఉంటుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కాగా.. కొన్ని దేశాల్లో కేసుల పెరుగుదలకు కారణమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుపుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీస్ నుంచి పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో అయిష్టంగానే ఉద్యోగులంతా తిరిగి కార్యాలయాల నుంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వ్యవస్థ గాడిలో పడుతున్న సమయంలో కరోనా కేసులు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.