Site icon HashtagU Telugu

Corona Update: భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఆగ‌ని మ‌ర‌ణాలు..!

Corona44

Corona44

భారత్‌లో కరోనా కేసులు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 50,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అయితే క‌రోనా కార‌ణంగా 804 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. రోజు రోజుకీ క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుతున్న‌, మ‌ర‌ణాలు సంఖ్య మాత్రం ఆందోళ‌ణ క‌ల్గిస్తుంది. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా క‌రోనా సోకి 5,07,981 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఇప్పటి వరకు ఇడియాలో 6,10,443 మంది రోగులు క‌రోనా నుండి కోలుకున్నారని, దీంతో ప్ర‌స్తుతం దేశంలో 6,10,443 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్ర‌క‌టించింది. మోత్తంగా చూసుకుంటే ఇండియాలో ఇప్పటి వరకు 4,25,86,544 మంది కరోనా బారిన పడ‌గా, వారిలో 4,14,68,120 మంది క‌రోనా నుండి కోలుకున్నార‌ని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే దేశ వ్యాప్తంగా 1,72,29,47,688 డోసుల కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు స‌మాచారం.కాగా డైలీ కరోనా పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించింది.