ఇండియాలో నిన్న ఒక్కరోజు కొత్తగా 25,920 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా నుండి 66,254 మంది కోలుకోగా, 492మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,27,80,235 కరోనా పాజిటీవ్ కేసులు నమోదవగా. 4,19,77,238 మంది కోలుకున్నారు. ఇక కరోనాతో దేశంలోఇప్పటి వరకు 5,10,905 మంది మరణించారు. ఇండియాలో డైలీ కరోనా పాజిటీవ్ రేటు 2.07 శాతం ఉండగా, ఇప్పటివరకు 1,74,64,99,461 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక తెలంగాణలో నిన్ని కొత్తగా 453 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెల్పింది. గత 24 గంటల్లో కరోనా నుండి 1,380 కరోనా నుండి కోలుకోగా, ఎలాంటి కరోనా మరణాలు నమోదుకాలేదు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,85,596 కరోనా కేసులు నమోదవగా, 7,74,742 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,746 కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజు కొత్తగా 528 కరోనా పాజిటవ్ కేసులు నమోదవగా, 1,864 మంది కరోనా నుండి కోలుకున్నారని, కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు ఏపీలో 23,15,030 మంది కరోనా బారిన పడగా, 22,90,853 మంది కోలుకున్నారని, కరోనా కారణంగా 14,707 మంది మృతి చెందగా, 9,470 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.