ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింద. ఇక కరోనా కారణంగా గత ఒక్కరోజులో 657 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్న ఒక్కరోజే 1,50,407 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు భారత్‌లో 6,97,802 మంది కరోనా నుండి కోలుకున్నారని, దీంతో ప్రస్తుతం దేశంలో 6,97,802 కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇకపోతే ఇండియాలో ఇప్పటి వరకు 4,25,36,137 మంది కరోనా బారిన పడగా, 5,07,177 మంది కరోనా కారణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 3.89 శాతం ఉండగా, ఇండియా వ్యాప్తంగా 1,71,79,51,432 మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Corona Update : భారత్‌లో కరోనా.. గ్రేట్ రిలీఫ్

Corona India