Site icon HashtagU Telugu

Corona: కరోనా మహమ్మారి తర్వాత పెరిగిపోయిన దీర్ఘకాలిక వ్యాధులు.. అవేంటంటే?

Corona

Corona

కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ఎక్కువగా శ్రద్ధను వహిస్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలు పెరిగిపోయాయి. కరోనా కేవలం ఊపిరితిత్తుల పై మాత్రమే కాకుండా మూత్రపిండాలు, గుండె, మెదడు, కాలేయం ఇలా ఎన్నో అవయవాలపై ప్రభావం చూపించింది. కరోనా తర్వాత హార్ట్ ఎటాక్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కరోనా తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.

మరి కరోనా తర్వాత ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఈ కరోనా తర్వాత ఆందోళన, దిగులు, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే, కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు కూడా మానసికపరమైన మార్పులకు కారణం గా చెప్పవచ్చు. అలాగే పాతోఫిజియాలజీలో ప్రొటీన్లను కరోనా లక్ష్యంగా చేసుకుంది. దాంతో కేన్సర్ కేసులు పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. మందిని కరోనా తర్వాత దీర్ఘకాలిక దగ్గు సమస్య వేధిస్తోంది.

శ్వాస తీసుకోవడంలో సమస్యలు, ఛాతీలో అసౌకర్యానికి తోడు ఆస్తమా, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లు పెరుగుతున్నట్టు నిపుణులు తెలిపారు. రక్తపోటు కేసులు కూడా కరోనా తర్వాత పెరిగాయి. అయితే అది శరీరంలో జరిగిన మార్పుల వల్లా లేక పెరిగిన అవగాహన వల్లా అనేది స్పష్టత లేదు. కరోనా తర్వాత భిన్న వయసు గ్రూపుల వారిలో రక్తపోటు బాధితుల సంఖ్య పెరిగింది. కరోనా తర్వాత వెలుగు చూస్తున్న ఎక్కువ కేసుల్లో గుండె జబ్బులు ప్రధానమైనవి. గుండె స్పందన వ్యవస్థపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బ్లడ్ క్లాట్, గుండె వైఫల్యాలు, హార్ట్ ఎటాక్ కేసులు పెరిగాయి.

Exit mobile version